భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. మూడు ఫార్మాట్ల లో కూడా రాణిస్తూ అదరగొట్టాడు అని చెప్పాలి. ఇక ఈ క్రమంలోనే అటు వరల్డ్ క్రికెట్లోనే అత్యుత్తమ బౌలర్గా ఎదిగాడు. ఇక ప్రస్తుతం టీమిండియా లో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా కూడా కొనసాగుతూ ఉన్నాడు. ఇక ఎన్నోసార్లు అతను అద్భుతమైన బౌలింగ్ ప్రతిభతో అటు భారత జట్టును కష్టాల్లో నుంచి బయటపడేసి విజయతీరాలకు నడిపించిన సందర్భాలు ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే బుమ్రాపై అందరూ ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు.
అయితే టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సైతం టీమిండియా ఫేస్ గుర్రం బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు. అతను ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అంటూ కొనియాడాడు. అలాంటి ఆటగాడు జట్టులో ఉండడమే ఒక గౌరవం అంటూ ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేసాడు. కేవలం ప్రదర్శన చేయడమే కాదు బాగా ఆడాలి అన్న ఆకలి కసి అతనిలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఆటలో ఏ సమయంలోనైనా వచ్చి ప్రభావం చూపించి మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల నైపుణ్యం బుమ్రా సొంతం అంటూ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. ఇకపోతే ప్రస్తుతం టీమిండియా అటు బంగ్లాదేశ్ తో సొంత గడ్డపై టెస్టు సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే.