నిధి అగర్వాల్.. అందానికి నిధి, ఆమె సౌందర్యపు జిగిబిగిని చూసి టాలీవుడ్ బాలీవుడ్ నుంచి తీసుకొచ్చేసింది. ఆమె తొలి సినిమా సవ్యసాచి. అక్కినేని నాగచైతన్యతో పెయిర్ గా నటించిన నిధికి ఆ మూవీ ఏమి హెల్ప్ చేయలేకపోయింది. గ్లామర్ కి మాత్రం మంచి మార్కులు మాత్రం పడ్డాయి. కొత్తందం బాగుందన్నారు. ఇక అక్కినేని మరో హీరో అఖిల్ తో మిస్టర్ మజ్ను మూవీ చేసింది నిధి. అయితే అది డిజాస్టర్ అయింది.
ఈ నేపధ్యంలో నిధి పని అయిపోయిందని అనుకున్నారంతా. అయితే ఆమెలోని అసలైన నిధిని సంచలన దర్శకుడు పూరీ జగన్నాధ్ బయటకు తీశారు. నిధి అందాల ఆరబోతతో రామ్ లేటేస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ హీటెక్కిపోయింది. మోత మోగించేసింది. నిధిలో ఇంత విషయం ఉందా అని టాలీవుడ్ ఇపుడు కచ్చితంగా తెలుసుకుందిట.
దాంతో నిధికి ఇపుడు టాలీవుడ్లో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయితే అవన్నీ కూడా యంగ్ హీరోల పక్కన మాత్రమే. నిధికి మాత్రం స్టార్ హీరోలతో యాక్ట్ చేయాలని ఉంది. అయితే మరో హిట్ పడితే తప్ప అది కుదిరే వ్యవహారం కాదంటున్నారు. ఇదిలా ఉండగా నిధి చేసినవి మూడు సినిమాలు. అందులో రెండు ఫ్లాప్స్ ఉంటే ఒకటి హిట్ ఉంది. దీంతో దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుందేమో నిధి ఒక్కసారిగా రేట్ పెంచేసింది.
సినిమాకు యాభై లక్షలు ఇస్తేనే చేస్తానంటూ పట్టుపట్టడంతో వచ్చిన ఆఫర్లు కూడా వెనక్కిపోతున్నాయట. చిన్న బడ్జెట్ లో సినిమాలు తీయాలనుకువేవారికి ఇపుడు నిధి అందుబాటులో ఉండడంలేదని టాక్ కూడా మొదలైంది. నిధి పెద్ద మూవీస్ ని ద్రుష్టిలో ఉంచుకుని ఇలా చేస్తోందని కూడా అంటున్నారు.
ఇస్మార్ట్ కి ముందు ఇరవయి, పాతిక లక్షల్లో ఉండే నిధి రెమ్యునరేషన్ ఒక్కసారిగా డబుల్ చేయడంతో నిర్మాతలు షాక్ తింటున్నారుట. నిధి మరీ ఇంత హీటా... వామ్మో అనుకుంటున్నారుట. మరి నిధి స్ట్రాటజీ ఏంటో తెలియదు. ఆమె కొత్త మూవీస్ తెలుగులో చేస్తుందా వచ్చిన డిమాండ్ ని అడ్డం పెట్టుకుని స్టార్ మూవీస్ మాత్రమే చేస్తుందా అన్నది తెలియాల్సివుంది.