ప్రేమికులకు జాతి ,కులం,మతం,బాషా,రంగు వంటి ఎటువంటి  బేధాలు లేవని మళ్ళి ఇంకోసారి నిరూపించారు ఒక  ప్రేమ జంట. ఆంధ్రాకు చెందిన అమ్మాయికి, అమెరికాకు చెందిన అబ్బాయికి  మధ్య మొదలయిన ప్రేమ ఖండాలను దాటుకుని ఇద్దరిని ఒక్కటి  చేసింది. అసలు విషయానికి వస్తే  విజయవాడ  మండలం గూడవల్లికి చెందిన గుంటక సత్యహరినాథరెడ్డి, జ్యోతి  దంపతుల కుమార్తె సంధ్య అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేసి ,ప్రస్తుతం ఒరెగాన్‌లోని ఇంటెల్‌ కార్పొరేషన్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తుంది.


అక్కడే  ఆమెకు అదే ప్రాంతానికి చెందిన ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ ఆడం బ్యాంగ్‌ తో  ఏర్పడిన పరిచయం తరువాత మెల్లిగా   ప్రేమగా మారింది. ప్రేమకు  రంగు ,బాషా వంటివి  అడ్డు రావని వీరి ప్రేమ మరోసారి నిరూపించింది. ప్రేమగా  మారిన  వీరి బంధం మూడుముళ్ళతో  ఒక్కటి కావాలని భావించి వాళ్ళ తల్లిదండ్రులుకు  వాళ్ళ ప్రేమ విషయం తెలిపారు.


వీరి  ఇరువురి ప్రేమను అర్ధం చేసుకున్న వాళ్ళ  కుటుంబ సభ్యులు పెద్ద  మనసుతో వీరి వివాహానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.దీంతో  పండితులు కుదిర్చిన ముహర్తం మేరకు మంగళవారం రాత్రి స్థానిక  విజయవాడ ఏబీ కన్వెన్షన్‌ సెంటర్లో వేద మంత్రోచ్ఛారణల నడము మూడు ముళ్ల బంధంతో ,హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు . ఈ వివాహానికి వైఎస్సార్‌ సీపీ కార్యకర్త  యార్లగడ్డ వెంకట్రావుతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు తరలివచ్చి నూతన వధూవరులను  ఆశీర్వదించారు.

చూడముచ్చటగా ఉన్న  ఈ జంటను చూసేందుకు వివాహానికి వచ్చిన అతిథులు ఆసక్తి  చూపారు . ఈ జంటను చూసిన వాళ్ళ బంధువులు,అతిధులు మళ్ళి మరో పడమటి సంధ్య రాగం ని తలపిస్తున్నారని తెలపగా జంటను చూసేందుకు వివాహానికి వచ్చిన అతిథులు పోటీ పడి మరి వెళ్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: