ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ఎంతో మందిని పొట్టనబెట్టుకున్న సంగతి అందరికి తెలిసిందే. స్వచ్చందంగా ఈరోజు అందరూ జనతా కర్ఫ్యూలో భాగం అయ్యారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత కారణంగానే ఈ మహమ్మారి వైరస్ ని దూరం చేయడం సాధ్యమవుతుందని, కాబట్టి ఎవరికీ వారు శుభ్రత పాటించి వారి వారి కుటుంభాలకి, సమాజానికి మేలు చేయాలని సూచించారు.

IHG

ఇదిలాఉంటే చేతులు ఎలా కడుక్కోవాలి, ఎన్ని రకాలుగా చేతులని శుభ్రం చేసుకోవచ్చు అనే విషయంలో ప్రభుత్వం పలు స్వచ్చంద సంస్థలు  అవగాహన కలిపిస్తున్నాయి. శానిటేషన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వివరించి చెప్తున్నాయి. అయితే దుబాయ్ లో ఉంటున్న భారత సంతతికి బాలుడికి ఓ సందేహం వచ్చింది. శానిటైజర్ లో ఉండే ద్రవాన్ని చేతులోకి తీసుకోవాలంటే ముందుకు శానిటైజర్ నొక్కాలి..

IHG

కానీ అలా నొక్కినపుడు క్రిములు, వైరస్  శానిటైజర్ మీద ఉండిపోతాయి. మరలా ఎవరైనా దాన్ని నొక్కినపుడు ఆ వైరస్ వారికి అంటుకునే ప్రమాదం ఉంటుంది కదా అనే ఆలోచన చేశాడు. వెంటనే దీనికి మార్గం కనిపెట్టాలని అనుకున్నాడు. దాంతో శానిటైజర్ లో ఉండే ద్రావకం దానంతట అదే వచ్చే విధంగా ఓ రోబోని తయారు చేశాడు.  ఆ భారత సంతతి బుడతడి పేరు సిద్ సంఘ్వీ. దుబాయ్ లోని స్ప్రింగ్ డేల్స్ స్కూల్ లో చదువుతున్నాడు. అతడు ఆవిష్కరించిన రోబో ముందు చేతులు పెట్టగానే దానంతట అదే చేతులపై ద్రావకాన్ని డిస్పెన్స్ చేస్తుంది. ఈ ప్రయోగంతో ఒక్క సారిగా దుబాయ్ లో ఈ బుడతడు ఫేమస్ అయ్యాడు. ప్రస్తుం కరోనా ఎఫెక్ట్ నేపధ్యంలో ఈ భారత సంతతి బాలుడి రోబో సృష్టించడం అద్భుతం అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు నెటిజన్లు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: