చైనా వస్తువులంటే ఏ స్థాయి క్వాలిటీ ఉంటుందో అందరికీ తెలిసిందే. చైనా వస్తువులకు ఎవరూ గ్యారంటీ, వారంటీ ఇవ్వరు. ఇప్పటికే పలు దేశాలు చైనా మాస్కులను తిప్పి పంపాయి. కనీసం కరోనాను ఎదుర్కోవడానికి తయారు చేస్తున్న పీపీఈ కిట్స్ విషయంలోనైనా చైనా క్వాలిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుందని ఆశిస్తే మరోసారి చైనా పలు దేశాలకు ఊహించని షాక్ ఇచ్చింది. 
 
తాజాగా చైనా నుంచి భారతదేశానికి 1,70,000 పీపీఈ కిట్లు వచ్చాయి. ఈ కిట్లలో 50,000 కిట్లు పనికిరావని తేలింది. గ్వాలియర్ లోని డీఆర్డీఓ లో ల్యాబ్ లో పీపీఈ కిట్ల స్టాండర్డ్స్ ను టెస్ట్ చేయగా 50,000 కిట్లు నాసిరకమని తేలిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలు యూరప్ దేశాలు చైనా సరఫరా చేసిన టెస్టింగ్ కిట్స్, పీపీఈ కిట్లలో క్వాలిటీ లేదని ఆరోపణలు చేసాయి. 
 
చైనా పంపిన కిట్ల వల్ల యూరప్ దేశాలు వైరస్ వ్యాప్తిని గుర్తించలేకపోయాయి. స్పెయిన్ ఇప్పటికే 6 కోట్ల టెస్టింగ్ కిట్లను వాపస్ పంపుతున్నట్లు ప్రకటన చేసింది. టర్కీ,నెదర్లాండ్, చెక్ రిపబ్లిక్ లాంటి దేశాలు కూడా మాస్క్‌లు ఇతరత్రా కిట్లను చైనాకు వాపస్ పంపించాలని నిర్ణయించాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 25 నుండి 30 శాతం మాత్రమే ఎగుమతి ప్రమాణాలను అందుకున్నాయని తెలుస్తోంది 

మరింత సమాచారం తెలుసుకోండి: