కరోనా వైరస్... ప్రపంచ దేశాలకు ఈ రేంజ్ లో చుక్కలు చూపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ అగ్ర రాజ్యాన్ని సైతం గడగడలాడిస్తోంది. ఇంకా అలాంటి కరోనా వైరస్ ని నియంత్రించేందుకు లాక్ డౌన్ అమలు చేసినప్పుడు మాత్రమే తగ్గి మళ్లీ విజృంభిస్తుంది. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం అయినా అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. వరుసగా మూడో రోజూ కూడా ఏకంగా 40 వేలకు పైగానే కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 34,831 మందికి వైరస్‌ వ్యాపించడంతో దేశంలో కేసుల సంఖ్య 26 లక్షల కు చేరుకుంది. ఇంకా అలానే తాజాగా 285 మరణాలతో మృతుల సంఖ్య 1,28,562కి చేరింది. 

 

IHG

 

ఇది ఇలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా 24గంటల్లో 1,60,586కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. బ్రెజిల్‌లోనూ కరోనా వైరస్ తీవ్రంగానే ఉంది. ఇంకా బ్రెజిల్ కూడా 24 గంటల్లో కరోనా వైరస్ ఏకంగా 33,434 మందికి సోకింది. దీంతో బ్రెజిల్ లో మొత్తం కేసులు 13,52,708కి చేరాయి. ఇక రష్యాలో కూడా కొత్తగా 6,719 కేసులు వెలుగుచూశాయి. 

 

ఇంకా పాకిస్థాన్ లో కొత్తగా 3,557కేసులు నమోదవ్వగా మొత్తం బాధితులు 2,06,512కి చేరారు. అయితే కరోనా వైరస్ సోకినా బాధితుడికి ప్రతి ఒక్కరోగికి రూ.17.66 లక్షల ఖర్చు అవుతుందని ఓ ఔషధ తయారీ సంస్థ వెల్లడించింది. కాగా భారత్ లో కూడా కరోనా వైరస్ తీవ్రత అదే రేంజ్ లో ఉంది. ప్రస్తుతం తగ్గే అవకాశం కనిపించడం లేదు. మరి ఈ కరోనా వైరస్ ఎప్పుడు అంతం అయ్యి సాధారణ స్థితికి వస్తుందో చూడలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: