భారత్-చైనా మధ్య ఉన్న సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు దేశాల మధ్య కూడా ముందు నుంచి కాస్త వివాదాస్పదంగా వాతావరణం  ఉంది అనే భావన చాలా మందిలో ఉంటుంది. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానిగా ఎన్నికైన తర్వాత చైనాతో మరింతగా విభేదాలు పెరిగాయి అనే భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఇక్కడ వేలు పెట్టడానికి కూడా చైనా ప్రయత్నాలు చేస్తుంది అనే ఆరోపణలు కూడా భారతీయ జనతా పార్టీ నేతలు అప్పుడప్పుడు చేస్తూ  ఉంటారు.

పాకిస్తాన్ సహకారంతో భారత్ లో అడుగు పెట్టడానికి చైనా అన్ని విధాలుగా కూడా సిద్ధం అవుతుంది అనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తలు ఏంటి అంటే భారత్ కు చైనా కు మరింత దూరం పెరిగే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం ఎక్కువగా ఉంది. ఎందుకు ఏంటనేది ఒకసారి చూస్తే అమెరికా అధ్యక్షుడు మారిన తర్వాత కూడా చాలావరకు మార్పు వచ్చింది అనే విషయం చెప్పవచ్చు. భారత్ తో గత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని విధాలుగా కూడా సన్నిహిత సంబంధాలు మెయిన్టెయిన్ చేశారు.

ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉండకపోవచ్చు అనే భావన ఉంది. రాజకీయంగా భిన్నమైన పరిణామాలు కూడా మూడు దేశాల మధ్య ఉన్నాయి. చైనా సహకారం అమెరికాకు చాలా ఎక్కువగా కావాల్సి ఉంటుంది. ట్రంప్ చైనాను ఎక్కువగా దూరం చేసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుత అధ్యక్షుడు అలాంటి రాజకీయం చేసే అవకాశాలు ఉండకపోవచ్చు. అంతర్జాతీయంగా కూడా చైనా పరువు తీయడానికి ట్రంప్ ప్రయత్నం చేసారు. కాబట్టి ఇప్పుడు భారత్ చైనా విషయంలో కాస్త జాగ్రత్త గా ఉండాల్సిన అవసరం ఉంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చైనా మన మీద ఆర్థికంగా కూడా ఆధార పడే అవకాశాలు ఉండకపోవచ్చు అని కూడా కొంతమంది అంటున్నారు. చైనా మార్కెట్ ఇప్పుడు అమెరికా మీద సహా ఆఫ్రికా దేశాల మీద ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశాలున్నాయని ఇప్పటివరకు అడుగుపెట్టని దేశంలో అడుగు పెట్టే అవకాశాలు ఉండవచ్చు అని కూడా అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: