ఆఫ్ఘ‌నిస్థాన్ లో అష్ర‌ఫ్ ఘనీ ప్ర‌భుత్వాన్ని తాలిబ‌న్లు దాడి చేసి హ‌స్త గ‌తం చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఆఫ్ఘ‌నిస్థాన్ లో తాలిబ‌న్ల ప్ర‌భుత్వం వచ్చిన నాటి నుంచి అక్క‌డి ప్ర‌జ‌లు ఎదో ఒక ర‌కం చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఆఫ్థాన్ ను తాలిబ‌న్లు పాలించ‌డం తో ఆ దేశానికి స‌హాయం చేయ‌డానికి ప్ర‌పంచ దేశాలు వెనక‌డుగు వేస్తున్నాయి. దీంతో ఆఫ్ఘ‌నిస్థాన్ లో రోజు రోజు స‌మ‌స్య‌లు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆఫ్ఘాన్ లో మ‌రొ కొత్త స‌మ‌స్య వ‌చ్చి పడింది. అదే ఆక‌లి. ఇప్పుడు ఆఫ్ఘాన్ లో ఆకలి చావులు రోజు రోజు కు పెరిగి పోతున్నాయి. చిన్న పిల్లలు తిన‌డానికి తిండి లేక అల‌మ‌టించి చ‌నిపోతున్నారు. ఇంత గ‌డ్డు ప‌రిస్థితి ఆఫ్ఘాన్ లో నెల‌కొన్న తాలిబ‌న్లు మాత్రం పట్టించు కోవ‌డం లేదు.ఆకలి చావులు రోజు రోజుకు ఆఫ్ఘాన్ లో పెరిగిపోతున్నాయి. తాజాగా ప‌శ్చిమ కాబూల్ లో ఉన్న హ‌జారా క‌మ్యూనిటీ లో కొంత  మంది చిన్నారులు ఆక‌లి తో చ‌నిపోయారు. ఈ విష‌యాన్ని ఆ దేశ మాజీ నాయ‌కుడు మొహ్మ‌ద్ మొహాఖేక్ సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపారు. అయితే చనిపోయిన చిన్న పిల్లలు దాదాపు 8 మంది వ‌ర‌కు ఉంటార‌ని ఆయ‌న తెలిపారు. అయితే ఆ 8 మంది కూడా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది. అయితే ఆఫ్ఘాన్ లో హ‌జారా క‌మ్యూనిటీ వారిని చిన్న చూపు చూస్తార‌ని స‌మాచారం. అయితే మొహాఖేక్ కూడా ఆఫ్ఘాన్ లో ఉన్న హాజారా, షీయా వారిని గౌర‌వించాల‌ని అన్నారు. అయితే ముఖ్యంగా ఆఫ్ఘాన్ లో 9 శాతం ఉన్న హాజారా లు చాలా స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు అని స‌మాచారం. అలాగే వీరిని గ‌త‌లో తాలిబ‌న్లు కూడా హింస గురి చేసారని తెలుస్తుంది. దీంతో ఇప్పుడు మ‌ళ్లి  హ‌జారా కు చెందిన వారే ఆక‌లి తో చ‌నిపోతుంటే తాలిబ‌న్లు ప‌ట్టించు కోవ‌డం లేద‌ని ప‌లువురు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు .  
మరింత సమాచారం తెలుసుకోండి: