ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఏ స్థాయిలో ప్రతిష్టంభన కొనసాగుతోంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండు దేశాల సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు హాట్ టాపిక్ గా మారిపోయింది. సరిహద్దుల్లో ఏం జరగబోతుందో అనే దాని గురించి అందరూ చర్చించుకుంటున్నారు. యూరోపియన్  యూనియన్లో కలిసేందుకు సిద్ధమైన ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైంది రష్యా.  ఈ క్రమంలోనే సరిహద్దుల్లో లక్షల మంది సైనికులను మోహరించింది. అణు ఆయుధాలతో పాటు అన్ని రకాల యుద్ధ విమానాలు కూడా సరిహద్దుల్లో మోహరించడం సంచలనంగా మారిపోయింది.


 ఇటీవల ఏకంగా ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధ విన్యాసాలు కూడా చేసింది రష్యా. ఇక యుద్ధానికి సిద్ధం అంటూ వ్యవహరిస్తూనే తమకు యుద్ధం చేసే ఉద్దేశం లేదని.. అంటూ స్టేట్మెంట్లు ఇస్తూ ఉండడం గమనార్హం. ఇటీవలే తమ సైన్యాన్ని వెనక్కి రప్పించాము అంటూ రష్యా అధికారికంగా ప్రకటన చేయడం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. సైన్యాన్ని వెనక్కి రప్పించడం వెనుక రష్యా వ్యూహం ఏంటి అని అందరూ చర్చించుకుంటున్న సమయంలో ఉక్రెయిన్ లో అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ లో ఉన్న వేర్పాటువాదులు ఆయుధాలు పట్టుకుని సైన్యంపై దాడికి దిగడం మొదలుపెట్టారు.


 దీంతో ఉక్రెయిన్ సైన్యం కూడా వేర్పాటు వాదుల పై ఎదురు దాడులు చేస్తూ ఉండడం గమనార్హం. ఇలా ఉక్రెయిన్ లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేర్పాటువాదులు ఇలా సైన్యంపై దాడి చేయడానికి వెనుక  రష్యా కుట్ర ఉంది అని నాటో యూరోపియన్ యూనియన్ దేశాలు భావిస్తున్నాయి.. ఇక ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రష్యా పై కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమయ్యాయి నాటో, యూరోపియన్ యూనియన్ దేశాలు. దేశ దౌత్య పరంగా అన్ని సంబంధాలను కట్ చేసుకోవడమే కాదు ఆర్థిక సహాయం చేయడం పై కూడా నిషేధం విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తే కూడా ఆయా దేశాలపై నిషేధం విధిస్తామని భయపెట్టి.. ఇక రష్యా కు ఉన్న అన్నీ సంబంధాలను కూడా పూర్తిగా కట్ చేసేందుకు ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ దేశాలు సిద్ధమయ్యాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: