
కాగా ఇమ్రాన్ ఖాన్ మత దూషణ చేశాడు అంటూ అతని పై కేసులు పెట్టడం లాంటివి చేసి ఇబ్బందులకు గురి చేశాడు. ఇలాంటి నేపథ్యంలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం లాంటివి చేస్తున్నారు. దీంతో పాకిస్థాన్ రాజకీయాలు ఎంతో హాట్ హాట్ గా మారిపోయాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే అటు ఇమ్రాన్ ఖాన్ ఏకంగా పాకిస్థాన్ ప్రభుత్వం చేస్తున్న చర్యలను ఖండిస్తూ షాకింగ్ కామెంట్ చేశారు. ఏకంగా పాకిస్తాన్ పై అణుబాంబు వేయడం మంచిది అంటూ ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి.
దేశాన్ని దొంగలకు అప్పజెప్పడం కంటే అణుబాంబు వేయడం మంచిది అని ప్రస్తుత పాకిస్తాన్ ప్రధాని షేబాజ్ అహ్మద్ ను ఉద్దేశిస్తూ ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగలు దేశాన్ని దోచుకోవడం చూసి షాక్ అయ్యానని.. ప్రతి వ్యవస్థను నాశనం చేస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. ఇక ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనెల 20వ తేదీన ఇస్లామాబాద్‌లో 20 లక్షల మందితో లాంగ్ మార్చ్ చేపట్టబోతున్నా అంటు మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. కాగా సొంత దేశం పాకిస్థాన్ పైనే ఇమ్రాన్ ఖాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది..