
బలం నిరూపణ చేసుకోవడంలో విఫలం కావడంతో చివరకు ప్రధాన మంత్రి పదవి నుంచి తప్పుకునే దుస్థితి ఏర్పడింది. అయితే ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి తప్పుకోవడానికి కారణం ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ప్రజలను కూడగట్టి పెద్ద పెద్ద ర్యాలీలు నిర్వహించడం సభలు పెట్టడమే అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ కూడా ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు ఇలాంటి వ్యూహలని అమలు చేస్తున్నాడు అనే విషయం తెలుస్తుంది. అంటే ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న హింసాత్మకమైన పాలనను ఎదిరించేందుకు ప్రజలందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలి అంటూ పిలుపునిచ్చారు ఇమ్రాన్ ఖాన్.
అటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఎప్పుడూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే అటు ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించబోతున్నారు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రతిపక్షాలు ఇమ్రాన్ ఖాన్ పదవి కోల్పోయే పరిస్థితి ఎలాగైతే తీసుకువచ్చారో.. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కూడా అదే పరిస్థితి తీసుకు వస్తాడు అని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే పాకిస్తాన్లో సైన్యం పాలన రావడం ఖాయం అంటూ అంచనా వేస్తున్నారు నిపుణులు.