ఇటీవలే నేపాల్ కు చెందిన విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. 22 మంది ప్రయాణికులతో బయలుదేరిన నేపాల్ తార ఎయిర్లైన్స్ విమానం కనిపించకుండా పోయింది. చివరికి రెండు రోజుల తర్వాత ఆచూకీ లభ్యమైంది. మేఘాల్లో కి వెళ్ళిన తర్వాత ఎత్తైన పర్వతాలను ఢీ కొని నేపాల్ కు చెందిన విమానం క్రాష్ అయింది అన్న విషయాన్ని అక్కడి అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో భారత్,జపాన్ సహా జెర్మనీ లకు చెందిన పౌరులు కూడా మృతి చెందడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ ప్రమాదం. దీంతో నేపాల్ కి విమాన ప్రయాణం ప్రాణసంకటం అంటు ఒక చర్చ జరుగుతుంది.



 అయితే ఇలా అనుకోవడానికి గల కారణాలు కూడా లేకపోలేదు అని చెప్పాలి.. నేపాల్ కి వెళ్ళాలి అనుకుంటే ట్రైన్ లో అయినా రోడ్ పై అయినా వెళ్ళండి కానీ విమానంలో మాత్రం అసలు వద్దు అంటున్నారు నిపుణులు. కారణం ఇప్పటి వరకు నేపాల్ విమానాలు ప్రమాదానికి గురికావడమే. 30 ఏళ్లలో ఏకంగా 27 సార్లు నేపాల్ విమానాలు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఇక దీనికి కారణం అనుభవం లేని పైలెట్లు, అంతే కాకుండా  నాణ్యమైన ఎయిర్ లైన్  ఏజెన్సీ కూడా లేకపోవడమే  కారణం అంటున్నారు నిపుణులు.


 ఇక చివరి పదేళ్ళలోనే నేపాల్ లో 20 విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి అనేది నిపుణుల నివేదికలు చెబుతున్నాయి. 2019లో చోపార్ ప్రమాదం 13 మంది చనిపోతే, 2018 లో విమాన ప్రమాదంలో 58 మంది చనిపోయారు. 2016 విమాన ప్రమాదంలో 20 మంది చనిపోయారు. ఇలా 2014 నుంచి వరుసగా ప్రతి ఏడాది విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయట. అయితే సరైన నాణ్యత కలిగిన ఎయిర్లైన్స్ లేకపోవడం ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతాలు కూడా నేపాల్ లోనే ఉండటం.. అనుభవజ్ఞులైన పైలెట్లు లేకపోవడం ఇక ప్రమాదాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అందుకే నేపాల్ కు విమాన ప్రయాణం ప్రాణసంకటం అంటూ చెబుతున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: