భారత దయాది దేశమైన పాకిస్థాన్ లో పరిస్థితులు రోజు రోజుకీ అధ్వానంగా  మారి పోతున్నాయి అనే విషయం తెలిసిందే. పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం ప్రతి రోజు తీవ్ర రూపం దాలుస్తుంది. ఈ క్రమం లోనే ఇక ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు అటు ప్రపంచ దేశాల నుంచి అప్పులు కావాలంటు చెయ్యి చాచే పరిస్థితి ఏర్పడింది. అదే సమయం లో ఇక పాకిస్తాన్ రాజకీయాల్లో అనూహ్యమైన  ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి అనే విషయం తెలిసిందే.


 మొన్నటి వరకు ప్రధాన మంత్రి పదవి లో కొన సాగిన ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు పదవి కోల్పోయారు. ప్రజలందరినీ తనవైపు తిప్పు కునేందుకు పాకిస్తాన్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యం లోనే పాకిస్తాన్ మూడు ముక్కలు కాబోతోందా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితు లను చూస్తే అలాగే అనిపిస్తుంది. అంతే కాకుండా ఇటీవల ఇమ్రాన్ ఖాన్ ఇస్తున్న స్టేట్మెంట్లు కూడా ఇలాగే ఉన్నాయి అని చెప్పాలి.  పాకిస్తాన్ ని మూడు ముక్కలు చేసేందుకు భారత్ కుట్రలు పన్నుతోంది అంటూ ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు. ఇలాంటి స్టేట్మెంట్ తో అక్కడి ప్రజలందరూ కూడా రెచ్చ గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆ ప్రాంతం లో వరుసగా దాడులు జరుగుతున్నాయ్.. అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగింది అని చెప్పాలి. సైన్యం పోలీసులను తుపాకుల తో కాల్చేస్తున్న నేపథ్యం లో ప్రభుత్వం అక్కడ కర్ఫ్యూ విధించే పరిస్థితి కూడా ఏర్పడింది.  మరో  వైపు సింద్ ప్రాంతం లో కూడా తిరుగుబాటు దారులు ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తున్నారు. దీంతో పాకిస్థాన్ లో ఇలాంటి పరిస్థితులను రావడానికి  భారత ప్రభుత్వ కుట్రలే కారణమంటూ అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఉండటం చర్చ నీయాంశం గా  మారి పోయింది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: