కొత్త విషయాలను కనుగొనడం అంటే అతనికి ఎంతో పిచ్చి. ముఖ్యంగా కొత్తరకమైన సర్పాలను వెతకడం అంటే ఎంతో ఇష్టం. ఇంకేముంది చిన్నప్పటినుంచి అరుదైన పాము జాతులు మీద పరిశోధన చేయడం మొదలుపెట్టాడు సదరు వ్యక్తి. ఇక ఆ పాములను కాపాడటం కోసం ఎంతగానో కృషి చేశాడు. కానీ చివరికి అదే పాముకాటుతో ఇటీవలే ప్రాణాలు కోల్పోయాడు. ప్రఖ్యాత పాము ఔత్సాహికుడు అయిన విలియం హెచ్ విషయంలో ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. ఆయన మరణించినట్లు ఇటీవలే కుటుంబ సభ్యులు అధికారికంగా ధ్రువీకరించారు.


 ప్రస్తుతం అతని వయస్సు ఎనభై ఏళ్లు. వెస్ట్ వర్జీనియా లోని హార్బర్స్ ఫెర్రీ లో తమ ఇంట్లో బందీగా ఉన్నా కలప గిలక్కాయ అనే పాము కరిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  ఈ క్రమంలోనే వెంటనే ఆసుపత్రిలో చేరినప్పటి చివరికి పరిస్థితి విషమించి విలియం హెచ్ మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన తో ఒక్కసారిగా కుటుంబంలో విషాదం నెలకొంది అనే చెప్పాలి. విలియం హెచ్ మరణం నేపథ్యంలో ఆయనతో ఉన్న సంబంధాన్ని ఎంతోమంది గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.


 అయితే 80 ఏళ్ళ వయసులో కూడా రిమోట్ ఏరియాలలో పాము జనాభాను లెక్కించడానికి వాటిపై డాక్యుమెంటరీ తీయడం కోసం స్థానిక పర్వతాలపై క్రమం తప్పకుండా విలియం హెచ్ వెళ్లేవారు అంటూ ఎంతో మంది గుర్తు చేసుకున్నారు. వయసు మీద పడుతున్న కూడా కష్టమైన ప్రాంతాల్లో కూడా ట్రెక్కింగ్ చేశారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే అరుదైన కలప గిలక్కాయ పాముల పై పరిశోధన చేసిన ఏకైక వ్యక్తి ఇక విలియం హెచ్ మాత్రమే అంటూ ప్రముఖ రాటిల్ స్నేక్ పరిశోధకుడు జాన్ సీలి చెప్పుకొచ్చాడు. వీటిని కనుగొనడం చాలా కష్టమైనప్పటికీ విలియం హెచ్  చిన్నతనం నుంచే ఈ పాముల పై ప్రత్యేక అధ్యయనం చేశారని గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: