సాధారణంగా ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరిన వ్యక్తి సరిగ్గా పనిచేయడం లేదని ఇక ఆఫీసులో పని చేసే సమయంలో కూడా ఎక్కువగా టైం పాస్ చేస్తున్నాడు అనే కారణంతో ఇప్పుడు వరకు ఉద్యోగులను ఇక జాబ్ నుంచి తొలగించడం లాంటి ఘటనలు ఎన్నోసార్లు చూశాం. మరికొన్నిసార్లు ఇక సంస్థ నష్టాల్లో ఉన్న సమయంలో కేవలం నమ్మకస్తులైన కొంతమంది ఉద్యోగులను మాత్రమే అంటిపెట్టుకొని మిగతా వారికి ఉద్వాసన పలకడం లాంటి ఘటనలు కూడా ఇప్పటివరకు చాలానే తెర మీదికి వచ్చాయి అని చెప్పాలి.


 కానీ ఇక ఆఫీసులో ఎంతో బాగా పనిచేసి.. ఇక అందరిలాగా పార్టీలు పబ్బులు అని తిరగకుండా బుద్ధిగా నడుచుకునే ఉద్యోగి దొరికాడు అంటే చాలు ఇక కంపెనీ అలాంటి ఉద్యోగులని కళ్ళకు అద్దుకొని మరి జాబ్ లో పెట్టుకుంటుంది అని చెప్పాలి. కానీ ఇక్కడ ఒక కంపెనీ మాత్రం అలా చేయలేదు. ఏకంగా ఎంజాయ్మెంట్ కు దూరంగా ఉంటున్నాడు అన్న కారణంతో ఉద్వాసన పలకడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అందరిలాగా పార్టీలు ఎంజాయ్ చేయకపోవడం ఇక కలిసిమెలిసి మాట్లాడకపోవడమే అతని జాబ్ కి ఎసరు పెట్టింది.


 జర్మనీకి చెందిన క్యూబిక్ అనే సంస్థ ఇలా వింత కారణంతో ఒక ఉద్యోగికి ఉద్వాసన పలికింది అని చెప్పాలి. ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత మిస్టర్ టి అనే ఉద్యోగి.. కంపెనీ ఏర్పాటు చేసిన పార్టీలకు హాజరు కావడం లేదు. ఇక వీకెండ్ లో తోటి ఉద్యోగులతో కలిసి ఎంజాయ్ చేయడానికి వెళ్లడం లేదు. ఇక ఇలా అతను సరిగా ఎంజాయ్ చేయడం లేదు అన్న కారణంతో కంపెనీ అతని ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో సదరు ఉద్యోగి ఊరుకోకుండా కోర్టును ఆశ్రయించి జరిగిన విషయం చెప్పడంతో అతనికి నష్టపరిహారం చెల్లించాలి అంటూ కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఏదేమైనా ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయం కాస్త విచిత్రంగానే ఉంది కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri