ఇటీవల కాలంలో రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే టెక్నాలజీకి అనుగుణంగానే అటు మనిషి జీవన శైలి కూడా మారిపోతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా పెరిగిపోయిన టెక్నాలజీని వాడుకోవడానికి అటు ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తి చూపుతూ ఉన్నారు. తద్వారా ఇక కూర్చున్న చోటికి అన్ని వస్తువులను తెప్పించుకుంటూ సామాన్యులు సైతం విలాసవంతమైన జీవితాన్ని గడపగలుగుతున్నారు అని చెప్పాలి.


 ఒకప్పుడు సంపన్నులు మాత్రమే పని వాళ్ళని పెట్టుకొని కావలసినవి దగ్గరికి తెప్పించుకోవడం చేసేవారు. కానీ ఇప్పుడు సామాన్యులు సైతం స్మార్ట్ఫోన్ లో ఒక్క క్లిక్ తో అన్ని వస్తువులను కూడా ఇంటిముందుకే తెప్పించుకోగలుగుతున్నారు. అయితే ఇలా కావాల్సిన వస్తువులను మాత్రమే కాదు టెక్నాలజీ ఏకంగా ఒక మనిషికి సాటి మనిషికి తీర్చాల్సిన అన్ని అవసరాలను కూడా తీర్చేస్తుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు  ఇలాంటి ఘటనే జరిగింది. ఇక్కడ ఒక యువకుడు ఏకంగా కిస్సింగ్ డివైస్ ని కనుగొన్నాడు. కిస్సింగ్ డివైస్ ఏంటి.. ఇది ఏదో కొత్తగా ఉందే.. ఇదేమైనా మనుషుల్లాగా కీస్ పెడుతుందా అని అంటారా..


 మీరు చెప్పింది నిజమే ఇది ఎక్కడో దూరంలో ఉన్నవారు మనకు కిస్ పెట్టినప్పుడు ఆ కిస్ ని మనకు చేరవేస్తూ ఉంటుంది అని చెప్పాలి.. చైనాలోని ఒక యూనివర్సిటీకి చెందిన జియాంగ్ అనే వ్యక్తి దీన్ని కనుగొన్నాడు. దూరంగా ఉన్న ప్రియురాలి కోసం ఓ యాప్ తో పాటు సిలికాన్ మెటీరియల్ తో లిప్స్ డివైస్ ను తయారు చేశాడు. అయితే చార్జింగ్ పోర్ట్ ద్వారా ఈ డివైస్ ను కనెక్ట్ చేసి యాప్ ద్వారా వీడియో కాల్స్ ద్వారా ముద్దు పెట్టుకోవచ్చు. ఇంకా దీని విశేషం ఏమిటంటే అవతల ఉన్న వ్యక్తి ఎంత గాఢంగా కిస్ పెడితే ఇక ముద్దు మరోవైపు ఉన్నవారికి అదే రీతిలో అందుతూ ఉంటుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: