సాధారణంగా ఎంతోమంది గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోవాలని ఆశ పడుతూ ఉంటారు. ఇలా ఆశపడిన వారు తమలో ఉన్న టాలెంట్ను నిరూపించుకుని గిన్నిస్ బుక్ లో తమ పేరు కనిపించేలా చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో అయితే కొంతమంది గిన్నిస్ బుక్ లో చోటు కోసం చేస్తున్న పనులు కాస్త హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ఇలాంటి పనులకు చేసి కూడా అటు వరల్డ్ రికార్డు సాధించవచ్చ అని ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఇక్కడ ఏకంగా ఒక మహిళ తన కాళ్లతోనే గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకుంది.


 అదేంటి కాళ్లతో కూడా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోవచ్చ.. అందరికీ కాళ్లు ఉంటాయి కదా అందులో కొత్త ఏమి ఉంది అని అనుకుంటున్నారు కదా. సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా తమ కాళ్ళని ముందుకి వెనక్కి పెట్టడం చేస్తూ ఉంటారు  కొన్ని కొన్ని సార్లు సైడ్ కి పెట్టడం కూడా చేస్తారు. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం తన కాళ్ళను క్లాక్ వర్క్ లాగా వేరే దిశల్లో ముందుకు వెనక్కి తిప్పి గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఏకంగా తనకాలను  గడియారం ముళ్ళు లాగా విభిన్నమైన రెండు దిశల్లో పెడుతుంది ఇక్కడ ఒక మహిళ. కెల్సి గ్రబ్ అనే మహిళ న్యూ మెక్సికోలోని ఆల్బమ్ కేర్ కి లో ఉంటుంది. అయితే తన పాదాలను 171.4 డిగ్రీలు తిప్పి గిన్నిస్ రికార్డు సృష్టించింది.


 కెల్సి మాట్లాడుతూ తాను ప్రస్తుతం లైబ్రరీలో పనిచేస్తున్నాను. అయితే కొత్త ప్రపంచ రికార్డుకు సంబంధించిన పుస్తకం రాగానే నా సహోద్యోగి ఒకరు ఆ పుస్తకం వైపే చూస్తూ ఉండిపోయింది. ఓ మహిళ కాలు మెలి తిప్పడం అక్కడ చూసాను. ఇది చూసిన తర్వాత నేను కూడా అలాంటిది చేయాలని అనుకున్నాను. అనుకున్నదే తడవుగా  నా పాదాలు తిప్పడం మొదలుపెట్టాను. ఈ క్రమంలోనే తన చీలిమండను పూర్తిగా విరుద్ధంగా మార్చడానికి ప్రయత్నించిన.. తనకు ఏ బాధ కలిగించలేదని ఆమె చెబుతూ ఉంది. ఏది ఏమైనా ఇలా ఎవరికీ సాధ్యం కాని విన్యాసం చేసి ఆమె గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: