
ఇక కొంతమంది అయితే ఏకంగా పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే పిడుగు ఎలా ఉంటుంది అని అడిగితే అది ఒక మెరుపుతీగ లాగా ఉంటుందని అందరు సమాధానం చెబుతారు. అయితే ఇందుకు సంబంధించి విమానంలో నుంచి తీసిన వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. పిడుగులతో కూడిన వర్షం అనే పదం మనం సాధారణంగా వాడుతూనే ఉంటాం. ఉరుము అనగానే చీకటి మేఘాలు మెరుపులు పిడుగులు శక్తివంతమైన గాలులు వర్షం లాంటి వాతావరణం లో సంభవించే ఎన్నో నాటకీయ వాతావరణ మార్పులు కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి.
అయితే మనం భూమి మీద ఉండి ఆకాశం నుంచి కురిసే ఉరుములతో కూడిన వర్షాన్ని చూడటం అనేది ఎప్పుడు జరిగేది. కానీ ఏకంగా ఆకాశం నుంచి ఉరుములను చూస్తే ఎలా ఉంటుంది అన్నది చాలామందికి తెలియదు. అయితే సోషల్ మీడియాలో ఇలాంటి తరహా వీడియోనే ఒకటి వైరల్ గా మారిపోయింది. ఏకంగా భూమికి 35000 అడుగుల ఎత్తులో నుండి పిడుగులు ఎలా ఉంటాయో తీసిన ఫుటేజ్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. 35 వేల అడుగుల ఎత్తులో ఉరుము పిడుగులతో కూడిన వర్షం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వీడియో చూడండి అంటూ క్యాప్షన్ ఇస్తూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.