తమ పిల్లలు ఉన్నత విద్య అభ్యసించాలి..విదేశాలకు వెళ్లి బాగా డబ్బు సంపాదించాలి..లేదంటే సొసైటీలో ఉన్నతమైన ఉద్యోగంలో ఉండాలి..పెద్ద ఉద్యోగంలో చేరాలి..ఇలాంటి కలలు ప్రతి తల్లిదండ్రులు కంటుంటారు.  అయితే వారి కలలను ఆసరాగా చేసుకొని కొన్ని కార్పొరేట్ కాలేజీ సంస్థలు పిల్లల పాలిట శాపాలుగా మారుతున్నాయి. తెలంగాణలో ఇంటర్ పరీక్షల సందర్భంగా దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద శ్రీ చైతన్య కళాశాలలో పరీక్షలు రాస్తున్న గోపీరాజ్ అనే విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
Related image
వెంటనే పరిక్షా కేంద్రం నిర్వాహకులు విద్యార్థిని హుటాహుటిన సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ విషయమై వైద్యులు మాట్లాడుతూ.. గోపీరాజ్ మార్గమధ్యంలోనే చనిపోయాడని తెలిపారు. గోపిరాజ్ స్వస్థలం ఖమ్మం జిల్లా గోపీరాజు స్వస్థలమని వెల్లడించారు. గోపీరాజ్‌ ఎల్లారెడ్డిగూడ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. గోపీరాజ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.  విషయం తెలుసుకున్న విద్యార్థి కుటుంబ సభ్యులు గాందీ ఆసుపత్రి వద్ద కన్నీరు మున్నీరవుతున్నారు. 

Image result for students mental tension

వత్తిళ్లే కారణమా ?
విద్యార్థులకు మంచి ర్యాంకులు రావాలని స్టడీ అవర్స్ ఎక్కువ చేయడం..వారికి కంటిమీద కునుకు లేకుండా చేయడం తో మానసిక వత్తిళ్లకు లోనవుతున్నారు విద్యార్థులు.  ఇటు ర్యాంకుల కోసం టీచర్లు పెట్టే ఇబ్బంది..అటు తల్లిదండ్రులు మేం ఇంత ఖర్చు చేసి చదివిస్తున్నాం..ర్యాంకు రాకుంటే మా మర్యాద పోతుందని అనడం..మొత్తం మీద విద్యార్థులు సతమతమవుతున్నారని మానసిక నిపుణులు తెలుపుతున్నారు.  ఇలా వత్తిళ్లకు లోనయిన వారు ఆత్మహత్యలు చేసుకోవడం..అనారోగ్యానికి గురికావడం జరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. చాలా మంది కార్పోరేట్ కళాశాల విద్యార్థులు మానసిక వొత్తళ్లకు లోనై ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: