గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ పరాజయం పాలైంది.  2014 లో కంటే కొంతమేరకు లాభపడినా.. పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.  కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న అమేథీ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో పోటీ చేసిన రాహుల్ గాంధీ ఓటమి పాలవ్వడం ఆ పార్టీకి షాక్ అని చెప్పాలి.  అయితే, రాయల్ కేరళలోని వాయనాడ్ నియోజక వర్గం నుంచి కూడా పోటీ చేయడంతో విజయం సాధించారు.  వాయనాడ్ నియోజక వర్గం ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టాడు.  పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  


రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఫెయిల్ కావడంతో పాపం కాంగ్రెస్ పార్టీ మరింత ఇబ్బందుల్లో పడిపోయింది.  ఎవరిని నియమించాలి అనే దానిపై గత కొంతకాలంగా మల్లగుల్లాలు పడుతున్నది.  ఇప్పటికే కొంతమంది పేర్లను పరిశీలించింది కాంగ్రెస్ పార్టీ.  ఇది వేరే విషయం అనుకోండి.  దేశంలో అనేక రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.  ఈ వర్షాల ధాటికి చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి.  ముఖ్యంగా కేరళ. 


కేరళలోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి.  వాయనాడ్ లో భారీవర్షం కురుస్తోంది.  కొండచరియలు విరిగిపడటం వలన రవాణా సౌకర్యం ఆగిపోయింది.  వరదలు ముంచెత్తడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  పరిస్థితిని సమీక్షించిన వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోడీకి ఫోన్ చేశారు.  వాయనాడ్ లోని పరిస్థితిని వివరించారు.  వీలైనంత త్వరగా సహాయం చేయాలనీ కోరారు.  


రాహుల్ అంతటివాడు ఫోన్ చేసి అడిగితె మోడీ కాదంటాడా చెప్పండి.  కావాల్సిన సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.  వాయనాడ్ విషయంలో సహాయ సహకారాలు అందించాలని మోడీ అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. వాయనాడ్ ను అన్ని విధాలుగా ఆదుకుంటానని చెప్పిన మోడీ, చెప్పినట్టుగా ఆదేశాలు జారీ చేశారు.  మాటల మనిషిని మాత్రమే కాదని చేతల మనిషిని కూడా అని మోడీ మరోమారు నిరూపించుకున్నారు.  మరి మోడీ సహాయంపై రాహుల్ ఎలా స్పందిస్తారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: