ఎన్నికలు ముగిసి చాలా కాలం అయ్యింది.  ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే విషయం అందరికి తెలుసు.  వైకాపా తగినన్ని స్థానాలు గెలుచుకుంటుంది.  ఇక ఇదిలా ఉంటె, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఓ టెన్షన్ నెలకొని ఉన్నది.  అది కరోనా వైరస్ టెన్షన్ అనుకుంటే పొరపాటే.  దానికి మించిన టెన్షన్ ఇది.  కరోనా ఉంటె వైద్యులు చూసుకుంటారు కానీ, రాజకీయాలకు సంబంధించిన విషయాలు చూసుకోవాల్సింది రాజకీయ నాయకులే కదా.  


ఈ నెలాఖరులో ఏపీలో నాలుగు, తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వీటి కోసం అనేకమంది ప్రయత్నం చేస్తున్నారు.  ఎవరికీ అవకాశం వస్తుంది.  ఎవరు అందులో కూర్చుంటారు.  ఎవరు రాజ్యసభకు వెళ్లారు అనే విషయాలపై ఆసక్తి నెలకొన్నది.  దీనిపై అనేకమంది అనేక రకాలైన విషయాలు వెల్లడిస్తున్నా ఫైనల్ గా మాత్రం ఎవరు అన్నది అధినేతలు నిర్ణయయించాల్సిందే

  
ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాల్లో ఒక సీటును సిట్టింగ్ ఎంపీకి కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు.  మిగిలిన మూడు సీట్లు మాత్రమే జగన్ దగ్గర ఉంటాయని, ఆ మూడు సీట్లు ఎవరికీ దక్కుతాయనే టెన్షన్ పడుతున్నారు.  ఈ మూడు సీట్ల కోసం చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు.  జగన్ చుట్టూ తిరుగుతున్నారు.  అయితే, ఈ మూడు సీట్లలో కూడా ఒకటి మైనారిటీలకు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.  


ఆ ఒక్కరు ఎవరు అన్నది తెలియాల్సి ఉంది.  బహుశా హిందూపురం నుంచి బాలయ్యపై పోటీ చేసి ఓడిపోయిన ఇక్బాల్ కు రాజ్యసభ సీటును కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.  అదే విధంగా తెలంగాణ విషయంలో కూడా ఇదే విధమైన వార్తలు వినిపిస్తున్నాయి.  ఫైనల్ గా డిసైడ్ చేసేది సీఎం కేసీఆర్ అయినప్పటికీ కూడా అభ్యర్థులను నిర్ణయించేది కేటీఆర్ అని అంటున్నారు.  అందుకే ఆశావహులు కేటీఆర్ చుట్టూ తిరుగుతున్నారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: