విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కు చేదు అనుభవం ఎదురయ్యింది. రోడ్డు శంకుస్థాపన పనుల్లో స్థానిక వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జరిగిన ఘర్షణలో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలకు గాయాలు కావడంతో వెలగపూడి రామకృష్ణ రోడ్డు పై కూర్చుని నిరసన తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గాయాలు కావడంతో వెలగపూడి రామకృష్ణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కార్యకర్తలపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని వెలగపూడి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

IHG

నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకుంటే వైసీపీ నేతలు కావాలని గొడవలు పెట్టుకున్నారని ఎమ్మెల్యే వెలగపూడి పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి చంద్రబాబు హయాంలోనే బీజం పడిందని, కానీ నిధులు రావటం లో చాలా జాప్యం జరిగిందని ప్రభుత్వం మారటంతో మరింత ఆలస్యం అయిందని, ఇన్నాళ్లకు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరుగుతుంటే వైసీపీ పార్టీకి చెందిన గుండాలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

 

IHG

పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం జరిగిందని వెలగపూడి రామకృష్ణ తెలిపారు. ప్రశాంతమైన విశాఖలో వైసిపి నాయకులు మరియు గూండాలు రౌడీలు అలజడి సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వెలగపూడి రామకృష్ణ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. జరిగిన ఘటనలో ఇద్దరికీ గట్టిగా గాయాలయ్యాయి. గాయపడిన ఇరు పార్టీలకు చెందిన వారిని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: