తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ భయంకరంగా వ్యాప్తి చెందడంతో ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రావటం లేదని ప్రభుత్వ వ్యవస్థ లతోపాటు ప్రతిపక్షాలు కూడా సీరియస్ గానే ఉన్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కరోనా విషయంలో ముఖ్యమంత్రి కేసిఆర్ వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. సోమరిపోతు గా కేసిఆర్ కరోనా విషయంలో వ్యవహరిస్తున్నారని, రాష్ట్ర ప్రజల ప్రాణాలు పోతున్నా కేసిఆర్ లో చలనం లేదని ఇలా ఉంటే తెలంగాణ నాశనం అంటూ చెప్పుకొచ్చారు.

IHG's Sensational Comments On <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=KCR' target='_blank' title='kcr-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>kcr</a> & Owaisi

కరోనా చికిత్స విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కార్పోరేట్ ఆస్పత్రులకు డబ్బులు కట్టలేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బాధ పడ్డారు. ఆ సమస్యను చిన్నదిగా చూపించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ముఖ్యంగా కరోనా హెల్త్ బులిటెన్ లో అన్ని అవాస్తవాలు చెబుతూ ప్రజలలో కరోనా మీద భయం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. అదే రీతిలో కరోనా ట్రీట్మెంట్ అందిస్తున్న వైద్యులకు కూడా కనీస భద్రత కల్పించడం లేదని దానివల్ల వైద్యులు కూడా చికిత్స అందించడానికి ముందుకు రావటం లేదని వ్యాఖ్యానించారు. 
IHG'blatant lies'

హైకోర్టు మరియు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినా… కేసిఆర్ లైట్ గా తీసుకోవడం వల్లే కరోనా రాష్ట్రంలో విలయతాండవం చేస్తుంది అని మండిపడ్డారు. అంతేకాకుండా కేసిఆర్ ఫాంహౌస్, ప్రగతి భవన్ నుంచి బయటకు రావాలని, కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజల ప్రాణాలు గురించి హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా స్పందించకపోవడం దారుణమని కేసీఆర్ పై బండి సంజయ్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం శవాల దిబ్బగా మారుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: