మందు పడితేనే మందుబాబులకు తెల్లారదు.  అలాంటిది మద్యం దుకాణాలు బంద్ ఉన్న రోజున పాపం వారి కష్టాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు.  ఎక్కడ చిన్న చుక్క దొరుకుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.  మందు లేకుంటే కిక్కు ఎక్కకుండానే చిందులు వేస్తుంటారు.  చిందర వందరగా మాట్లాడుతుంటారు. ముందుకు బాబులు ఎక్కడెక్కడికో పరుగులు తీస్తుంటారు. మద్యానికి అలవాటు పడిన ప్రాణాలు పాపం ముందుకు తహతహలాడిపోతుంటాయి.  

కొన్ని ముఖ్యమైన రోజుల్లో మందు షాపులు తప్పనిసరిగా బంద్ అవుతుంటాయి.  విషయం ఏమిటంటే, మద్యం దుకాణాలు బంద్ అయినప్పటికీ అదే రోజున మద్యం వ్యాపారం జోరుగా సాగుతుంది.  అక్రమ మార్గంలో.  ఈ విషయం అందరికి తెలుసు.  కానీ సైలెంట్ గా ఉండిపోతారు. ఎవరి వాటాలు వాళ్లకు ఉంటాయి కదా మరి.  

ఇకపోతే, ఈరోజు హైదరాబాద్ లో గణేష్ నిమర్జనం ఉన్నది.  దీనికోసం ట్యాంక్ బండ్ మీద 21 క్రేన్లు ఏర్పాటు చేశారు.  ఈరోజు తెల్లవారు జాము నుంచే విగ్రహాలను నిమర్జనం చేస్తున్నారు.  పెద్ద సంఖ్యలో గణపతి విగ్రహాలు ట్యాంక్ బండ్ వద్ద బారులు తీరాయి.  ఇక ఇదిలా ఉంటె, గణేష్ నిమర్జనం రోజున హైదరాబాద్ లో మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి.  ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు షాపులు తెరుచుకోవు.  

నిమర్జనం రోజున మద్యం దుకాణాలు బంద్ ఉంటాయి,  మందుబాబులు ముందుగానే స్టాక్ తెచ్చి పెట్టేసుకొని ఉంటారు.  ఈరోజు బ్లాక్ లో మందు కొనాలి అంటే భారీగా డబ్బులు పెట్టాల్సి ఉంటుంది.  ప్రతి ఏడాది గణేష్ నిమర్జనం ధూమ్ ధామ్ గా నిర్వహించేవారు.  కానీ, కరోనా కారణంగా ఈ ఏడాది సాదాసీదాగా నిర్వహిస్తున్నారు.గుంపులు గుంపులుగా ట్యాంక్ బండ్ వద్దకు రానివ్వకుండా పోలీసులు కట్టడి చేస్తున్నారు.  ప్రతి వినాయకుడి విగ్రహం ఉండే వాహనం పై పది మంది కంటే ఎక్కువ మందిని ఉండనివ్వడం లేదు.  ఇక ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభం అవుతుంది. ఈ శోభాయాత్రకు కూడా పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: