భారత దేశంలో కొవిడ్-19 మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా ఉపాధి కోల్పోయి ఆకలి తో అలమటిస్తున్న వలస కార్మికుల ఆహార భద్రతా అవసరాలను తీర్చడానికి ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్‌ భారత్ ప్యాకేజీ లో భాగంగా భారత ప్రభుత్వం మే నెలలో అనేక ఆర్థిక సహాయ సహకారాలను ప్రకటించింది. కానీ అర్హత కలిగిన లబ్ధిదారులకు పూర్తిగా ప్రయోజనం చేకూర్చాల్సిన ఆహార ధాన్యాల పథకం పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదని నివేదికలు పేర్కొంటున్నాయి.


తాజాగా భారత ప్రభుత్వం విడుదల చేసిన ఒక గణాంకం ప్రకారం ఈ పథకం కింద వలస కార్మికులకు కేటాయించిన ఎనిమిది లక్షల టన్నుల ఆహార ధాన్యాల లో కేవలం 33 శాతం లబ్ధిదారులు మాత్రమే ప్రయోజనం పొందారని విశ్లేషకులు వెల్లడించారు. లాక్ డౌన్ విధించడం వలన మే, జూన్ నెలల లో వలస కార్మికులు తమ పని ప్రాంతాల నుండి వారి స్వగ్రామలకు లక్షల సంఖ్య లో పయనమయ్యారు.


ఐతే ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్యాకేజీ ప్రకటించిన తరువాత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 6.38 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను సేకరించాయి. కానీ ఇందులో కేవలం 2.64 లక్షలు మాత్రమే పంపిణీ చేశారు. ఈ పథకం లో భాగంగా వలస కార్మికులకు దాదాపు 2 నెలల పాటు ఉచిత ఆహార ధాన్యాలు పంపిణీ చేశారు.


ఆహార భద్రతా చట్టం ద్వారా లబ్ది పొందని వారికి, రేషన్ కార్డులు లేని వారికి ఆత్మ నిర్భర్‌ భారత్‌ పథకం వర్తిస్తుంది.  మే, జూన్ నెలలలో ఐదు కిలోల ఆహార ధాన్యాలు ఇవ్వాల్సి ఉంది.  జూలై, ఆగస్టు నెలలకు ఇప్పటికే ఆహార ధాన్యాలను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఆహారధాన్యాలను వలస కార్మికులకు పంపిణీ చేయడం లో ఎటువంటి అవరోధాలను ఎదుర్కొంటున్నాయో తెలియడం లేదని కేంద్ర ప్రభుత్వం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: