దిశా... ఈ పేరు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు అన్నీ కూడా విస్మయం వ్యక్తం చేసాయి. శంషాబాద్ శివారులోని తొండుపల్లి టోల్‌గేట్ సమీపంలో నవంబర్ 27న వెటర్నరీ డాక్టర్‌ దిశ బైక్‌ కు పంచర్ చేసి డ్రామా ఆడి అనంతరం బలవంతంగా తీసుకెళ్లి నలుగురు దుర్మార్గులు హైదరాబాద్ శివారుల్లో... షాద్ నగర్ వద్ద అత్యాచారానికి ఒడిగట్టి.. కిరాతకంగా సజీవ దహనం చేయడం చాలా మందిని కలవరపెట్టింది. ముందు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత విచారణ చేసారు.

మరుసటి రోజే కేసును చేధించి వెంటనే.. నలుగురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటూ దేశవ్యాప్తంగా నిరసనలు జరగడమే కాకుండా వాళ్ళను కాల్చి చంపాలి అని మహిళా సంఘాలు ఆందోళనలకు దిగాయి. నలుగురు నిందితుల్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి.. రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తీసుకుని వెళ్ళారు. ఆ సమయంలో వారిని జైలుకు తీసుకెళుతుండగా.. ప్రజలు వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేసారు. కొద్ది రోజులకు నిందితుల్ని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేసారు.

అందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత నలుగురు నిందితుల్ని సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసేందుకు తీసుకెళ్లగా.. వారు ఎదురు తిరిగి పోలీసులుపై దాడికి దిగడంతో ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారు. అప్పుడు జరిగిన పోలీసుల కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తర్వాత ఈ ఎన్‌ కౌంటర్‌ పై మానవ హక్కుల సంఘం విచారణ.. ఆ వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసారు. ప్రస్తుతం ఈ కేసు ఘటన విచారణ జరుగుతుంది. కాగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ పై ప్రసంశలు వ్యక్తమయ్యాయి. ఆయనను అప్పుడు సోషల్ మీడియాలో హీరోలా చూసారు అందరూ.

మరింత సమాచారం తెలుసుకోండి: