ఆంద్ర ప్రదేశ్ లో సి‌ఎం జగన్ ప్రకటించిన మూడు రాజధానుల వ్యవహారం ఎంత సంచలనం సృష్టించింధో అందరికీ తెలిసిందే. అమరవతిని శాసన రాజధాని గాను,కర్నూల్ ను న్యాయ విభాగ రాజధాని గాను,విశాఖపట్నం ను కార్యనిర్వాహక రాజధాని గాను సి‌ఎం జగన్ ప్రకటించారు. జగన్ ప్రకటించిన ఈ నిర్ణయంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

 ఎక్కడ లేని విధంగా జగన్ పిచ్చి తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నాడని ప్రతిపక్షాలు ఘాటు విమర్శలు చేస్తున్నాయి. అంతే కాకుండా " మూడు రాజధానులు వద్దు - ఒకే రాజధాని ముద్దు " అనే నినాదంతో అమరావతి నే రాజధానిగా కొనసాగించాలని అమరావతి ప్రాంత ప్రజలు ఏడాది కాలంగా ఉద్యమం కొనసాగిస్తున్నారు. ఈ క్రమం లో ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల వ్యవహారంపై ఓ వైపు హైకోర్టులో విచారణ జరుగుతుంది. మరోవైపు అమరావతి ఉద్యమం ఉధృతంగా సాగుతుంది.

ఈ తరుణంలో జగన్ సర్కారు మరొకసారి సంచలన ప్రకటన చేసింది.విశాఖపట్నం కు పరిపాలన రాజధానిగా మార్చడం పై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశాడు. తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా విశాఖపట్నం చట్ట పరంగా పరిపాలన రాజధానిగా మరాబోతుందని బొత్స స్పష్టం చేశాడు. ఈ ప్రకటనతో సి‌ఎం జగన్ మూడు రాజధానుల ఏర్పాటు పై ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. .

మరింత సమాచారం తెలుసుకోండి: