సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్స్ అనేది కేవలం సినిమాలు తీయడం మాత్రమే కాదు, ప్రేక్షకుల మనసులను గెలుచుకుని, వాళ్ల రుచుల్ని అర్థం చేసుకుని, ఆ రుచులకనుగుణంగా సినిమాలు తెరకెక్కించే స్థాయికి ఎదగాలి. ఆ క్రమంలో తాజాగా ఓజీ సినిమా  సృష్టించిన  రికార్డు లే పెద్ద ఉదాహరణ అని అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో కూడా మనకు తెలుసు.ఇలాంటి దశలో ఇప్పుడు అందరి దృష్టి సందీప్ రెడ్డి వంగా వైపు మళ్లింది. ఆయన సినిమాలు అంటే ఎప్పుడూ సంచలనమే. ఒకవైపు అర్జున్ రెడ్డి, మరోవైపు  అనిమల్ సినిమాతో ఆయన తన స్థాయిని మరోసారి నిరూపించుకున్నాడు. రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన అనిమల్ ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
 

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఊహించని స్థాయిలో కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ అనిమల్ 2 రూపొందనున్నట్లు సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఆయన స్పిరిట్ సినిమా (ప్రభాస్ హీరోగా)కి కమిట్ అయి ఉన్నారు. ఆ సినిమా పూర్తి చేసిన తర్వాతే అనిమల్ 2 పై పూర్తి స్థాయిలో వర్క్ మొదలు పెడతారని తెలుస్తోంది.ఇకపోతే అనిమల్ 2లో స్టార్ కాస్టింగ్ విషయంలో సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే ముందస్తు ప్లానింగ్ మొదలు పెట్టేశారని ఇండస్ట్రీ టాక్. ముఖ్యంగా ఇందులో ఒక కీలకమైన పాత్ర ఉంటుందని, ఆ పాత్రకి ఇచ్చే ఎలివేషన్స్ హీరో రేంజ్‌ని మించిపోతాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పాత్ర కోసం సందీప్ రెడ్డి వంగా టాలీవుడ్‌ టాప్ హీరోని టార్గెట్ చేశారట. ఆయనను ఇప్పటికే అప్రోచ్ చేసి, కథ కూడా వివరించారట. ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉండగా, అభిమానులు అయితే ఎవరా హీరో అనే కుతూహలంతో ఊగిపోతున్నారు. నిజంగానే ఆ తెలుగు స్టార్ హీరో అనిమల్ 2లో ఎంట్రీ ఇస్తే, బాక్సాఫీస్ వద్ద రచ్చ రంబోలా కట్టడం ఖాయం అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.



సందీప్ రెడ్డి వంగా ప్లాన్ ప్రకారం అన్నీ అనుకున్నట్లే జరిగితే, అనిమల్ 2లో ఆ తెలుగు హీరో దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అని చెప్పుకోవచ్చు. ఇలా ఒక బాలీవుడ్-టాలీవుడ్ కాంబినేషన్ మల్టీ స్టారర్‌గా ఈ సినిమా తెరకెక్కితే, అది ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీ క్రేజీ ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: