
కాబట్టి ఆయన తెరకెక్కించే ప్రతి సినిమాకు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడతాయి. విరుపాక్ష సినిమాతో బ్లాక్ పోస్టర్ హిట్ కొట్టిన కార్తీక్ వర్మ దండు, ప్రస్తుతం అక్కినేని నాగచైతన్యతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ వర్కింగ్ టైటిల్ ‘NC 24’ అని ఉంది. ఈ సినిమా కోసం కార్తీక్ వర్మ దండు కష్టపడి పనిచేస్తున్నాడు, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ సినిమా లో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. ఈ సినిమాలో బోలెడన్ని సర్ ప్రైజ్ లు ప్లాన్ చేశాడట కార్తిక్ వర్మ దండు.
ఇప్పుడు ఫ్యాన్స్‌కి మరొక సంతోషకర్ వార్త తెలిసింది. కార్తీక్ వర్మ దండు హర్షిత అనే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు. నిన్న హైదరాబాద్ లో వారి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్యంగా, నాగచైతన్య-శోబితా ధూళిపాల జంట, సాయిధర్మతేజ్ మరియు బీ విఎస్ ఎన్ ప్రసాద్ వంటి ఇతర ప్రముఖులు కూడా హాజరై, వధూవరులను ఆశీర్వదించారు.ఎంగేజ్మెంట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజలు ఈ జంటను చూడముచ్చటగా ఉందని, ఎంతో ఆనందంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కార్తీక్ వర్మ దండు సినిమాలు యువతకు చాలా నచ్చుతాయి. ఆయన సినిమాలు కుర్రాళ్లను ఆకట్టుకునే విధంగానే ఉంటాయి. అందుకే ఆయనను ‘కుర్రాళ్ల ఫేవరేట్ డైరెక్టర్’ అని పిలుస్తారు. ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆయన పెళ్లి వార్త బాగా ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతుంది.