
ఆమె తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది..“ 30 ఏళ్లు దాటిన తర్వాత మీరు ఈ ప్రపంచాన్ని చూసే విధానం కచ్చితంగా మారుతుంది. అందం, డబ్బు సంపాదించడం, గుర్తింపు – అన్నింట్లో మార్పులు వస్తాయి. అందుకే జీవితాన్ని ఆస్వాదించాలంటే 20 ఏళ్లలోనే చేయాల్సినవి చేయాలి, లేకపోతే ప్రతి విషయంలో ‘సమయం మించిపోయింది’ అనే భావన వస్తుంది. నా 20 ఏళ్ల కాలం గందరగోళంగా గడిచింది. డబ్బు కోసం, గుర్తింపు కోసం ఆరాటపడ్డాను. ఆ సమయంలో నేను ఏం చేస్తున్నానో, ఎలా చేస్తున్నానో కూడా తెలియదు. లోపల ఒకలా, బయటకి ఒకలా హడావుడిగా జీవించాను. ఇప్పుడు 30 ఏళ్లలో నేను మారిపోయాను. నా ఆలోచన విధానం పూర్తిగా వేరుగా ఉంది. గతంలో చేసిన తప్పుల జ్ఞాపకాలు మోసుకుంటూ పరిగెత్తడం ఆపేశాను. ఇప్పుడు నాకు నేను టైమ్ కేటాయిస్తున్నాను. పబ్లిక్‌లో ఒకలా, ఒంటరిగా ఉన్నప్పుడు మరోలా ఉండటం లేదు. నేనేంటో నేనే అర్థం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ దశలోనే మీరు గర్వంగా, ధైర్యంగా, ఆనందంగా, స్వేచ్ఛగా ఉండగలరు.” సమంత ఇలా రాసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా ఈ పోస్ట్ పై రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది “ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా?” అని కౌంటర్లు వేస్తుంటే, మరికొందరు “యు ఆర్ వెరీ లక్కీ” అంటూ ప్రశంసిస్తున్నారు. కొంతమంది “ఇది లవర్స్‌కి ఇచ్చే ఘాటు సలహా” అని కామెంట్లు పెడుతుంటే, ఇంకొంతమంది “ఇదే కారణం నిన్ను ఇష్టపడటానికి” అంటూ పాజిటివ్ రియాక్షన్లు ఇస్తున్నారు. అలాగే, మరికొందరు “ఈ మాటలు ఎవరికో బాగా తగిలేలా గట్టిగా వేసిందిగా!” అంటూ చురకలు వేస్తున్నారు. ఇలా సమంత పెట్టిన పోస్ట్ ఒక్కరోజులోనే పాజిటివ్, నెగిటివ్ కామెంట్లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.