
సాధారణంగానే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి అంటే చాలు అన్ని పార్టీలు కూడా తమ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించి.. ఇక తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే పనులను అన్నిటిని కూడా వివరిస్తూ ఉంటాయి. ఇక ఈ మేనిఫెస్టో ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బి.జె.పి. మేనిఫెస్టో విడుదల చేసింది. మేనిఫెస్టో లో పొందుపరిచిన కొన్ని అంశాలు మాత్రం ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి అన్నది తెలుస్తుంది. ఇటీవలే బిజెపి విడుదల చేసిన మేనిఫెస్టోలో పొందుపరిచిన ఒక అంశం కాదు ప్రస్తుతం విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇటీవలే పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు వస్తాము అంటూ ఒక హామీని పొందుపరిచారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని అంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. ఈ అంశాన్ని మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. అయితే ప్రస్తుతం ప్రత్యేక హోదా మనుగడలో లేదని ఏ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు అంటూ పార్లమెంటు వేదికగా చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు పుదుచ్చేరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎలా ప్రకటిస్తారు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు ప్రతిపక్ష పార్టీలు.