టైటిల్ చూసి బూతు చట్టాలు ఏంటని ఆశ్చర్య పోకండి.. బూతు చట్టాలు అంటే బూతు గురించి చెప్పే  చట్టాలు అని తప్ప బూతు చట్టాలు అని కాదు.. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. అరచేతిలోని స్మార్ట్ ఫోన్‌లో దొరకంది అంటూ ఏమీలేదు. స్మార్ట్ ఫోన్‌ వచ్చాక పోర్న్‌ కంటెంట్‌ కూడా సులభంగా అందుబాటులోకి వచ్చింది. దీనికి తోడు బాగా తగ్గిన డేటా ధరలతో ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్లలో బూతు చిత్రాలు వీరవిహారం చేస్తున్నాయి.


ఈ నేపథ్యంలో అసలు బూతు గురించి చట్టాలు ఏం చెబుతున్నాయి. పోర్న్‌ చిత్రాలు చూడటం నేరం అవుతుందా.. పోర్న్ చిత్రాలు షేర్ చేస్తే నేరం అవుతుందా..అసలు మన ఫోన్‌లో పోర్న్‌ దృశ్యాలు ఉండొచ్చా.. ఇలా అనేక సందేహాలు సహజం. వాటికి సమాధానాలు చూద్దాం.. మన దేశంలో వ్యక్తిగతంగా ఆశ్లీల చిత్రాలు చూడటం నేరం కాదని 2015 జులైలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అంటే అది మన వ్యక్తిగత వ్యవహారం అన్నమాట. అయితే.. అశ్లీల చిత్రాలు షేర్ చేయడం మాత్రం నేరమేనట.


పోర్న్‌ చిత్రాలు కలిగి ఉండటం నేరం కాకపోయినా.. చైల్డ్ పోర్న్‌ కంటెంట్ కలిగి ఉండటం మాత్రం చాలా పెద్ద నేరం. పోక్సో చట్టం 2012 ప్రకారం ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ చూడడం నేరం. అంతే కాదు.. చైల్డ్‌ పోర్న్ వీడియోలు కలిగి ఉండడం, వాటిని డౌన్‌లోడ్‌ చేయడం  కూడా నేరమే. ఇక బ్లూఫిలింస్‌ గురించి  ఐపీసీ 292, 293, ఐటీ చట్టంలోని సెక్షన్‌ 67, ఇన్‌డీసెంట్‌ రిప్రంజంటేషన్‌ ఆఫ్‌ ఉమెన్‌(ప్రొహిబిషన్‌) చట్టం చెబుతాయి. ఈ చట్టాల  ప్రకారం నీలి చిత్రాలు తీసినా, వాటిని ప్రచారం చేసినా అలాంటి వారిపై పోలీసులు కేసులు నమోదు చేయొచ్చు.


ఇక ఐపీసీ 354 ప్రకారం..ఏ మహిళకు సంబంధించిన వ్యక్తిగత దృశ్యాలు ఆమెకు తెలియకుండా చిత్రీకరించడం నేరం అవుతుంది. అలాంటి చిత్రాలు చూడటం కూడా నేరమే. ఐపీసీ 294 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం నేరం. అంతే కాదు.. మహిళలను  ఏ రూపంలో అయినా అమర్యాదకరంగా చూపడం, ప్రదర్శించడం కూడా నేరాలే. ఇన్‌డీసెంట్‌ రిప్రంజంటేషన్‌ ఆఫ్‌ ఉమెన్‌(ప్రొహిబిషన్‌) చట్టం 1986 కింద ఈ విషయాలు నేరంగా పరిగణిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: