హైదరాబాద్ లో జరిగిన దిశ అత్యాచారం హత్య కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అమాయకురాలైన వెటర్నరీ డాక్టర్ దిశా ను నలుగురు క్రూరమృగాలు అతి దారుణంగా అత్యాచారం చేయడమే కాదు పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం అందరినీ ఒక్క సారిగా ఉలిక్కి పడేలా చేసింది.  ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. అయితే నలుగురు నిందితులకు ఉరిశిక్ష వెయ్యాలి అంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.  లేదంటే నిందితులను బయటికి పంపించండి వారి ప్రాణాలు మేము తీస్తాము అంటూ ఏకంగా జైలు ముందు భారీ నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి.


 ఇలాంటి తరుణంలో దిశ కేసులో నలుగురు నిందితులను కూడా పోలీసులు ఎన్కౌంటర్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. అయితే రేప్ కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేయడం దేశ ప్రజానీకం మొత్తం హర్షం వ్యక్తం చేసింది.  కేస్ రీ స్ట్రక్చరింన్  చేస్తున్న సమయంలో నిందితులు తమ వద్ద నుంచి తుపాకులు లాక్కొని దాడి చేయడంతో నే ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది అంటూ పోలీసులు వివరించారు. దీనిపై త్రిసభ్య కమిషన్ ప్రస్తుతం విచారణ కొనసాగిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్కౌంటర్ లో చనిపోయిన మృతుల కుటుంబీకులు నుంచి  స్టేట్మెంట్లు తీసుకుంది త్రిసభ్య కమిషన్.



 ఇక ఇటీవలే చటాన్పల్లి ఎన్కౌంటర్ ఘటనలో క్షతగాత్రులైన పోలీసులకు ప్రథమ చికిత్స చేసిన షాద్నగర్ సిహెచ్సి వైద్యుడు డాక్టర్ నవీన్ ను త్రిసభ్య కమిటీ ఇటీవల విచారించింది. కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ కు అందించిన చికిత్స గురించి అడిగి తెలుసుకుంది. ఎడమ భుజంపై గాయాలైనట్లు నివేదికలో ఎలా పేర్కొన్నారు అంటూ డాక్టర్ నవీన్ను కమిషన్ ప్రశ్నించింది. కేర్ ఆసుపత్రి రికార్డులు చూసి రాశాను అంటూ డాక్టర్ నవీన్ సమాధానం చెప్పగా.. డిశ్ఛార్జ్ నివేదికలో ఆ వివరాలు లేవు కదా అని అడగడంతో వైద్యుడు నోట్స్ చూసి రాశాను అంటూ బదులిచ్చారు డాక్టర్ నవీన్.  ఒక ప్రభుత్వ వైద్యులు అయ్యింది ప్రైవేట్ డాక్టర్ రికార్డు చూసి ఎలా నివేదిక ఇచ్చారు అంటూ ప్రశ్నించింది త్రిసభ్య కమిషన్.  ఇక మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: