పాకిస్తాన్‌కు చెందిన సామాజిక కార్య‌క‌ర్త‌, నోబెల్ శాంతి బ‌హుమ‌తి గ్ర‌హిత మ‌లాలా యూస‌ఫ్‌జాయ్ బ్రిట‌న్‌లో పెళ్లి చేసుకున్నారు. త‌న స్నేహితుడు అస‌ర్ అనే వ్య‌క్తిని మలాలా  మ‌నువాడింది. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన‌ది. ఈ వివాహానికి ఆమె తల్లిదండ్రులు కూడా హాజ‌ర‌య్యారు.  తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో  షేర్ చేస్తూ ఈరోజు నా జీవితంలో ఓ అమూల్యమైన రోజు అని,  అసర్, నేను జీవితాంతం ఒకరికొకరు ఆసరాగా ఉండేందుకు పెళ్లి చేసుకున్నాం అని వెల్ల‌డించింది మ‌లాల‌.

 బర్మింగ్‌హామ్‌లోని మా ఇంట్లో మా కుటుంబంతో కలిసి చిన్న నికాహ్ వేడుక చేశాం. మా ఇరువురి ప్రయాణం పెళ్లితో ముందుకు సాగుతుండటం పట్ల సంతోషిస్తున్నామ‌ని, మాకు మీ శుభాకాంక్షలు కావాల‌ని పేర్కొన్నారు శాంతి బ‌హుమత్రి గ్ర‌హిత‌. తాలిబాన్లు 2012లో ఒక ఘోరమైన దాడికి పాల్పడ్డారు.  అక్టోబర్ 9న ఆ సంవత్సరం  మలాలా స్కూల్ బస్సులో వెళ్తుండగా తాలిబన్లు తలపై కాల్చారు.  పాకిస్తాన్‌లోని  స్వాత్ వ్యాలీలో నివాసం ఉండే మ‌లాల  బాలికల విద్య కోసం తన స్వరాన్ని పెంచి పోరాడిన‌ది.  ఆమె వయస్సు  అప్పుడు కేవలం 15 సంవత్సరాల మాత్ర‌మే. పరిస్థితి విషమించడంతో మలాలాను మెరుగైన‌ చికిత్స కోసం  బ్రిటన్‌కు తరలించారు.  శస్త్ర చికిత్స త‌రువాత ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ ఘటన త‌ర్వాత ఆమె తండ్రికి బ్రిటన్‌లోని పాకిస్తాన్‌ ఎంబసీలో ఉద్యోగం  ఇచ్చారు.

ప్రో-ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ పాకిస్తానీ పాఠశాల బాలిక మలాలా యూసఫ్‌జాయ్ ఐ యామ్ మలాలా పేరుతో తన జీవిత చరిత్రను కూడ  రాశారు. మీడియా నివేదికల ప్రకారం..  ఒకప్పుడు పాకిస్తాన్‌లోని వెనుకబడిన ప్రాంతంలో నివసించిన మలాలా దీని కోసం 3 మిలియన్ డాలర్లు పొందిన‌ది. ఐ యామ్ మలాలాను బ్రిటన్‌కు చెందిన విండెన్‌ఫెల్డ్ మ‌రియు నికల్సన్ ప్రచురించారు. ఈ పుస్తకం 8 అక్టోబర్ 2013న ప్రచురితమైంది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలు అయ్యేందుకు 2014లో లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నారు మ‌లాల‌. ఆ త‌రువాత  ఆమె కుటుంబంతో కలిసి బర్మింగ్‌హామ్‌కు మారిన‌ది.  ఇక్కడి బాలికలకు సాయం చేసేందుకు మలాలా ఫండ్ అనే స్వచ్ఛంద సంస్థను కూడ ప్రారంభించిన‌ది.  2020లో మలాలా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుండి ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు.

 2014లో ఆమెకు నోబెల్ శాంతి బహుమతి లభించిన‌ది. బాలల హక్కుల కోసం ఆమెతో కలిసి పనిచేసిన భారతదేశానికి చెందిన కైలాష్ సత్యార్థి కూడా ఈ అవార్డును ద‌క్కించుకున్నారు.  ఈ అవార్డును అందుకున్న అతి చిన్న‌ వయస్కురాలిగా మలాలా యూసఫ్ జాయ్ ఓ రికార్డు సృష్టించారు. ఆ సమయంలో మ‌లాల‌ వయస్సు  కేవ‌లం 17 సంవత్సరాలు  మాత్ర‌మే. మలాలా వివాహ వ్యవస్థపై  గతంలో  చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమ‌య్యాయి. ప్రముఖ మ్యాగజైన్ వోగ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మలాలా పెళ్లి అనవసరమని పేర్కొన్నారు. ఎందుకు పెళ్లి చేసుకుంటారో అర్థం కావడం లేదని ఆ సమయంలో ఆమె  చెప్పుకొచ్చింది. మీకు జీవిత భాగస్వామి కావాలంటే, మీరు వివాహ పత్రాలపై ఎందుకు సంతకం చేస్తారు అని..?   భాగస్వామ్యం మాత్రమే ఎందుకు కాదు అని మలాలా  ప్రశ్నిస్తూ చేసిన ప్రకటనపై ఆమె తండ్రి జియావుద్దీన్ యూసఫ్‌జాయ్ వివరణ ఇవ్వాల్సిన‌ వచ్చింది. తాజాగా  త‌న పెళ్లి విష‌యాన్ని తెలుపుతూ మ‌లాలా ట్వీట్ చేసారు.  




మరింత సమాచారం తెలుసుకోండి: