స్వాతంత్రంకు పూర్వ‌మే భార‌త‌దేశం నుంచి వంద‌ల ఏండ్ల చ‌రిత్ర క‌లిగిన ఎన్నో విలువైన విగ్ర‌హాలు, క‌ళాకండాలు, పురాత‌న వ‌స్తువులు దోపిడికి, అక్ర‌మ ర‌వాణాకు గురైనాయి. చాలా వ‌ర‌కు విదేశాల‌కు త‌రలిపోయాయి. కొన్ని అయితే ధ్వంసం అయ్యాయి. దోపిడీకి గురైన పురాత‌న విగ్ర‌హాల‌ను వెన‌క్కు తెప్పించేందుకు ద‌శాబ్దాలుగా భార‌త్ ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్న‌ది. ఆ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డంతో 1976 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మ‌న‌దేశం నుండి దోపిడికి గురైన 55 పురాత‌న విగ్ర‌హాలు, వ‌స్తువులు వివిధ దేశాల నుంచి తిరిగి వ‌చ్చాయి. ముఖ్యంగా ఇందులో 75 శాతం వ‌ర‌కు అన‌గా దాదాపు 42 విగ్ర‌హాలు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ హ‌యాంలోనే వ‌చ్చాయి. తాజాగా వందేండ్ల‌కు పైగా చ‌రిత్ర క‌లిగిన కాశీ అన్న‌పూర్ణ‌దేవి విగ్ర‌హం కెన‌డా నుంచి భార‌త్‌కు చేరిన‌ది. ఈ విష‌యాన్ని ఇటీవ‌లే మ‌న్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోడీ దేశ‌ప్ర‌జ‌ల‌కు వెల్ల‌డించారు.

అక్టోబ‌ర్ 05, 2021న భార‌త పురావ‌స్తు శాఖ ఈ విగ్ర‌హాన్ని అందుకున్న‌ట్టు కేంద్ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జీ.కిష‌న్‌రెడ్డి ధృవీక‌రించారు. ఈ విగ్ర‌హం న‌వంబ‌ర్ 11న ఢిల్లీ నుంచి శోభ‌యాత్ర‌గా వార‌ణాసి చేరుతుంది. దాదాపు  4 రోజులపాటు యాత్ర కొన‌సాగుతుంది. ఈనెల 15న కాశీలోని  అన్న‌పూర్ణ‌ ఆలయంలో అన్నపూర్ణా దేవి విగ్రహ ఆవిష్కరణను  యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా విగ్రహం పునఃప్రతిష్ట చేస్తారు.


దేశంలో అన్న‌పూర్ణ‌దేవీని కొలుస్తూ ఎన్నో దేవాల‌యాలున్నాయి. వార‌ణాసిలో అన్న‌పూర్ణ ఆల‌యం అతి ప‌విత్ర‌మైంది. కాశీవిశ్వ‌నాథునితో పాటు అన్న‌పూర్ణ‌దేవీ ఆల‌యాన్ని కూడ ఏలా ల‌క్ష‌లాది మంది ద‌ర్శించుకుంటారు భ‌క్తులు. కెన‌డాకు చెందిన నార్మ‌న్ మెకంజీ లాయ‌ర్ 1913లో వార‌ణాసిలో కొంత‌మందిని ఉసిగొలిపి దొంగ‌త‌నం చేయించారు. బెనార‌స్ శైలిలో చెక్కిన అన్న‌పూర్ణ‌దేవి విగ్ర‌హం కెన‌డాలోని రెజీనా యూనివ‌ర్సిటీలో మెకంజీ ఆర్ట్ గ్యాల‌రీలో  ఉన్న‌ద‌నే విష‌యం 2019 వ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌దు. దివ్య మెహ్రా అనే క‌ళాకారిని ద్వారా ఈ విష‌యం తెలిసిన‌ది. విన్నిపెగ్ కు చెందిన దివ్య మెహ్రా 2019లో పురాతన కళాఖండాలపై పరిశోధన చేస్తుండగా విష్ణుమూర్తి విగ్రహం స్త్రీ రూపంలో అన్న పాత్ర పట్టుకుని  ఉన్న విగ్ర‌హం ఆమె కంటపడింది. ఆమె ప‌రిశోధ‌న‌లో 1913లో వారణాసిలో దొంగిలించబడిందని వెల్ల‌డైంది.


ఈ విగ్ర‌హానికి సంబంధించిన ఆర్ట్ గ్యాల‌రీ సీఈఓతో మాట్లాడింది దివ్య‌మెహ్ర‌. తాను చేసిన ప‌రిశోధ‌న విష‌యాల‌ను ఒట్టావాలోని ఇండియ‌న్ హై క‌మిష‌న్‌, కెన‌డియ‌న్ హెరిటేజ్ డిపార్టుమెంట్‌ల దృష్టికి తీసుకెళ్లారు దివ్య‌మెహ్ర‌. భార‌త ప్ర‌భుత్వం దృష్టికి హైక‌మిష‌న‌ర్ తీసుకురావ‌డంతో కేంద్ర‌, ప‌ర్యాట‌క‌, సాస్కృతిక శాఖ మంత్రి కిష‌న్‌రెడ్డి దృష్టికి రావ‌డంతో ఈ విగ్ర‌హాన్ని తిరిగి తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు చేశారు. కేవ‌లం ఈ విగ్ర‌హం ఒక్క‌టే కాదు. మంత్రిగా కిష‌న్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ఎన్నో కీల‌క అంశాల‌పై కూడ దృష్టి సారించారు. ముఖ్యంగా రామ‌ప్ప దేవాల‌యానికి యూనెస్కో గుర్తింపు తేవ‌డానికి కూడ ఆయ‌న కృషి ఎంతో ఉంది. ఇటీవ‌లే కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి రామ‌ప్ప ఆల‌యాన్ని సంద‌ర్శించిన విష‌యం విధిత‌మే.

మరింత సమాచారం తెలుసుకోండి: