
అందుకే ఏ నియోజకవర్గంలో కూడా పార్టీ పరిస్తితి బాగుందని చెప్పలేని పరిస్తితి ఉంది. అలా అని ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు ఏమి గొప్పగా పనిచేయడం లేదు. ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారు. కానీ టీడీపీ వీక్ గా ఉండటమే వైసీపీ ఎమ్మెల్యేలకు బాగా అడ్వాంటేజ్ అవుతుంది. జిల్లాలో స్ట్రాంగ్‌గా ఉన్న వారిలో పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, తంబళ్ళపల్లెలో ద్వారకానాథ్ రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డిలు ఉన్నారు.
మిగిలిన ఎమ్మెల్యేలు ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నట్లు కనిపించడం లేదు. పలువురు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. గంగాధరనెల్లూరులో డిప్యూటీ సీఎం నారాయణస్వామికి పాజిటివ్ లేదు...కానీ ఇక్కడ టీడీపీ పరిస్తితి బాగోలేదు. నగరిలో రోజాకు పెద్దగా అనుకూలత లేదు. కానీ ఇక్కడ టీడీపీ ఇంచార్జ్ గాలి భాను ప్రకాశ్ సత్తా చాటడం లేదు. అటు పలమనేరులో ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ పనితీరుకు గొప్ప మార్కులు పడటం లేదు. అయితే ఇక్కడ టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఇంకా పుంజుకోవాలి.
పూతలపట్టులో ఎమ్మెల్యే బాబు పనితీరు పెద్దగా బాగోలేదు...అసలు ఇక్కడ టీడీపీకి లీడర్ లేరు. చిత్తూరు అసెంబ్లీలో కూడా అదే పరిస్తితి. సత్యవేడులో కూడా పార్టీ పరిస్తితి బాగోలేదు. ఇక కొద్దోగొప్పో పార్టీ కాస్త మెరుగ్గా ఉంది పీలేరులోనే...అది కూడా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఉన్నారు కాబట్టి...ఇక పార్టీ ఇలాగే కొనసాగితే..వచ్చే ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలవడం కష్టమే.