దేశవిభజన గురించి మరోసారి చర్చలు జరుగుతున్నాయి. స్వాతంత్రం రాగానే దేశవిభజన పై అప్పట్లో చర్చ జరగటంపై పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, మతపరమైన దేశంగా పాక్ ఆవిర్భవించింది. స్వేచ్ఛ గురించి, స్వాతంత్రం గురించి తెలిసిన భారత్ ఆ విభజన సందర్భంలో వారు చేసిన డిమాండ్లను అప్పటి కాంగ్రెస్ అంగీకరించకపోవడంతో అక్కడ విభజన తప్పనిసరి అయ్యింది. అదే జరిగి ఉండకపోతే, దేశం మరింత బలంగా ఉండేదని ప్రస్తుతం చర్చ నడుస్తుంది. కొందరు అయితే బ్రిటిష్ వారు స్వాతంత్రం ఇచ్చేముందు మతపర సున్నిత భావాలను రెచ్చగొట్టి భారత్ లో చిచ్చు బెట్టి వెళ్లిపోయారని అప్పటి పెద్దలు భావించారు. దానికి తగ్గట్టుగా జిన్నా తరపు వారు కూడా అనాలోచితంగా బ్రిటిష్ వారు చెప్పిన మాటలకు మోసపోయి ప్రత్యేక దేశం లాంటి నిర్ణయాన్ని తెరపైకి తెచ్చారు. గాంధీ సహా ఆ నిర్ణయం పెద్దలకు అసలు ఇష్టం లేకపోయినప్పటికీ, విభజన తప్పనిసరైంది.

జిన్నా వర్గీయులు తమకు 39 శాతం రిజర్వేషన్ కావాలని పట్టుబట్టగా, కాంగ్రెస్ 26 శాతం మాత్రమే కుదురుతుంది అనడంతో విభజన వైపు అడుగులు పడ్డాయి. ఇదొక్కటే కాకపోవచ్చు, అనేకపరిణామాలు ఉండొచ్చుగాక, ఇది దానికి మూలకారణం అని చెప్పవచ్చు. ఈ విభజన జరగకపోయి ఉంటె, దేశంలో పరిస్థితులు మెరుగ్గా ఉండేవని, కానీ ఇప్పుడు మతపరమైన అనేక కొత్త సమస్యలు వెలుగుచూస్తున్నాయని ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. రాజధాని ఢిల్లీలో ఇండో-పాక్ యుద్ధం 50 ఏళ్ళు కావడంతో జరిగిన స్వర్ణిమ్ విజయ్ పర్వ్ కార్యక్రమంలో పాల్గొన్న రాజనాధ్ సింగ్ విభజన పై ప్రస్తావించారు.

అప్పట్లో మతపరంగా విభజన జరిగి ఉండకుండా ఉంటె బాగుండేది అని రాజనాధ్ సింగ్ అన్నారు. ఇండో-పాక్ 1971 యుద్ధం అందుకు నిదర్శనంగా మిగిలిపోయిందని ఆయన అన్నారు. అప్పటి విభజనతో పాక్, భారతదేశాన్ని ముక్కలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. దీనిపై ఫరూక్ అబ్దుల్లా సమర్దించేవిధంగా స్పందించారు. నాడు విభజన జరిగింది అంటే అది వాళ్ళు కోరుకున్నారు కాబట్టే జరిగింది తప్ప భారత్ మెడపట్టుకుని నెట్టివేసిందేమి కాదు. వాళ్ళు కోరుకున్నట్టుగా చేయడం కూడా తప్పే అని వాళ్ళు భావించడం, వాళ్ళ సమస్య అవుతుంది తప్ప, భారత్ వైపు వేలు చూపించడం ద్వారా పొందేది ఏమి ఉండబోదు అనేది పాక్ గుర్తిస్తే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: