ప్రపంచ వ్యాప్తంగా  పేరుప్రఖ్యాతలున్న బచ్చన్ ఇంటి  కోడలు, బాలీవుడ్ నటి, తెలుగు వారికి సుపరిచితమైన  ఐశ్వర్య రాయ్ బచ్చన్ కి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు నమోదు చేస్తున్న పనామా పేపర్స్ లీకేజీ  వ్యవహారంపై ఆమెను విచారణ చేయనున్నట్టు ఈ డి తాజాగా జారీ చేసిన  సమన్లతో తెలిపిందీ.  విచారణ నిమిత్తం ఆమె ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో హాజరు తప్పనిసరని సూచించింది. వాస్తవానికి ఐశ్వర్యారాయ్ బచ్చన్కు గతంలో చాలాసార్లు సమన్లు జారీ అయ్యాయి ఆమె వాయిదా కోరుతూ వచ్చారు తాజాగా కూడా అంటే ఈ వేళ కూడా ఆమె విచారణకు హాజరు కాకపోవడం తెలుస్తోంది
 పనామాదేశానికి చెందిన కార్పొరేట్ సంస్థ  మొస్సాక్ ఫోన్సెకా. ఇందులో  ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు పెట్టుబడులు పెట్టారు. అలా పెట్టడం ద్వారా తమ తమ దేశాలలో పన్నులు  యధేచ్ఛగా ఎగ్గోట్టారు. ఈ విషయాన్ని తొట్టతొలిసారి  జర్మనీకీ చెందిన వార్తా సంస్థ ప్రపంచానికి వెల్లడించింది.
ఇది వివిధ దేశాల్లో వేలాదిమంది బడాబాబుల బాగోతం బట్టబయలు చేసింది. వివిధ కంపెనీలు వాటి బినామీలు వారికి వెన్నుదన్నుగా నిలిచే కార్పొరేట్ ప్రముఖులు సినీ రంగ గ్లామర్ స్టార్లు తమ రహస్య ఖాతాల్లో నిధులు దాచుకుంటారు. భారత దేశానికి బడాబాబుల జాబితా చిన్నది మాత్రం కాదు.చాటంత ఉంది. దాదాపు ఐదు వందల మందికి పైగా  ఈ జాబితాలో చోటు సంపాదించారు. ఇందులో నటులు, నాయకులే కాదు, క్రికెట్ క్రీడాకారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులూ ఉన్నారు. అందరూ  పన్ను ఎగవేత దారులే కావడం ఇక్కడి కామన్ ఫ్యాక్టర్. జర్మన్ దేశం తమ దేశస్తుల ఆస్తులపై సోదాలు చేసి లెక్క చెప్పకుండా దాచుకున్న నల్లధనాన్ని వారి వద్ద నుంచి రాబట్టింది. అదే  బాటలో పలు దేశాలు ప్రస్తుతం నడుస్తున్నాయి. భారత్ కు ప్రభుత్వ రంగ విచారణ సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ పనామా పెపర్స్ లో ఉన్న వారి పై నిఘా పెట్టింది. తగిన సాక్ష్యాధారాలు లభించడం తో వారి అరెస్టుకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో బడాబాబులను విచారణ చేస్తున్నది.  సినీనటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కు ఇది వరకు చాలా మార్లు సమన్లు జారీ చేసింది. ఆమె ఇప్పటి వరకూ ఈఢీ ముందుకు హాజరు కాకుండా ఉన్నారు. ప్రస్తుతం కూడా వాయిదా కోరే అవకాశం ఉందని  ఆమె సన్నిహిత వర్గాల కథనం




మరింత సమాచారం తెలుసుకోండి: