అధికార వైసీపీకి అనుకూలంగా ఉండే జిల్లాల్లో ప్రకాశం జిల్లా కూడా ఒకటి అని చెప్పొచ్చు. ఇక్కడ వైసీపీకి మంచి పట్టు ఉంది. ఆ విషయం గత రెండు ఎన్నికల్లోనూ రుజువైంది. గత ఎన్నికల్లో అయితే జిల్లాలో 12 సీట్లు ఉంటే వైసీపీ 8 సీట్లు గెలిచేసుకుంది. అటు టీడీపీకి 4 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇక టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం...వైసీపీ వైపుకు వచ్చేశారు. దీంతో వైసీపీ బలం 9కు చేరుకుంది.

అయితే ఈ బలం ఇలాగే కొనసాగుతుందా? ఇప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఏమన్నా ట్విస్ట్‌లు వచ్చాయా? ఇక్కడ పోలిటికల్ సీన్ ఏమన్నా మారుతుందా? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్తితులని బట్టి చూస్తే కాస్త సీన్ మారుతున్నట్లే కనిపిస్తోంది. అధికార బలం ఉండటం వల్ల...వైసీపీ వీక్ అయినట్లు కనిపించడం లేదు గానీ...క్షేత్ర స్థాయిలో చూస్తే వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వచ్చినట్లు కనిపిస్తోంది.

జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరిగినట్లు తెలుస్తోంది. పైగా కొన్ని చోట్ల టీడీపీ పికప్ అయింది. అలా పోలిటికల్ సీన్ మారిన నియోజకవర్గాల్లో దర్శి ముందు వరుసలో ఉంది. ఇక్కడ వైసీపీలో ఎంత రచ్చ జరుగుతుందో తెలిసిందే. వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు టీడీపీకి ప్లస్ అవుతున్నాయి. ఆ కుమ్ములాటలే దర్శి మున్సిపాలిటీలో వైసీపీ ఓటమికి కారణం. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే మద్దిసెట్టి వేణుగోపాల్ ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారు. ఇటు కనిగిరిలో వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ పరిస్తితి కూడా అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. ఇక్కడ టీడీపీ నేత ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పికప్ అయినట్లు కనిపిస్తోంది.

అలాగే భారీ మెజారిటీతో గెలిచిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై కూడా వ్యతిరేకత పెరుగుతుంది. ఇటు సంతనూతలపాడులో సైతం వైసీపీకి అంత అనుకూల పరిస్తితులు కనిపించడం లేదు. ఇక టీడీపీ సిట్టింగ్ సీట్లలో బలంగానే ఉంది. మొత్తం మీద చూస్తే ప్రకాశంలో పోలిటికల్ సీన్ మాత్రం మారుతున్నట్లు కనిపిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: