చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు చాలా విధాలుగా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇప్ప‌టికే పొత్తులతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే సామాజికవర్గాల సమీకరణల‌ను కూడా బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో భారీగా ప‌రిగ‌ణ లోకి తీసుకోనున్నారు. ముందుగా ఆయ‌న పార్టీ పై ఉన్న క‌మ్మ ముద్ర‌ను తొలగించేస్తార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ సారి గుంటూరు జిల్లాలో కొంద‌రు క‌మ్మ నేత‌ల‌కు షాక్ త‌ప్ప‌దా ? అన్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. అస‌లు ఏ జిల్లాలో లేని విధంగా ఈ జిల్లాలో క‌మ్మ నేత‌లు ఎక్కువ మంది ఉన్నారు.

జిల్లా లో 17 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో తాడికొండ - వేమూరు - ప్రత్తిపాడు నియోజకవర్గాలు ఎస్సీ  రిజ‌ర్వ్‌డ్‌. మిగిలిన 14 నియోజ‌క‌వ‌ర్గా ల్లో  పెదకూరపాడు - మంగళగిరి - పొన్నూరు - తెనాలి - సత్తెనపల్లి -  చిలకలూరిపేట - గురజాల - వినుకొండ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలు గా పోటీ చేశారు. పైగా గుంటూరు, న‌ర‌సారావుపేట ఎంపీ క్యాండెట్లు కూడా క‌మ్మ వారే. ఇక ఇటీవ‌ల గుంటూరు వెస్ట్ సీటు ఇన్‌చార్జ్ ప‌గ్గాలు కూడా క‌మ్మ వ‌ర్గం నేత‌కే ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీళ్ల‌లో కొంద‌రి సీట్ల‌కు కోత పెట్టేస్తార‌ని అంటున్నారు.

అయితే ఎవ‌రి సీట్ల‌కు కోత ప‌డుతుందో ?  ప్ర‌స్తుతానికి అర్థం కావ‌డం లేదు. ఈ సారి క‌మ్మ వ‌ర్గం సీట్ల‌లో కోత పెట్టి ఇత‌ర కులాల వారికి ఇస్తార‌ని అంటున్నారు. అయితే అంద‌రూ సీనియ‌ర్ నేత‌లే కావ‌డంతో ఎవ‌రిని ప‌క్క‌న పెడ‌తారో ?  కూడా అర్థం కావ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ జిల్లాలో పెద్ద ప్ర‌యోగ‌మే చేసింది.  చిలకలూరిపేట -  గుంటూరు వెస్ట్ - పొన్నూరు - సత్తెనపల్లిలో వైసీపీ అభ్యర్థుల ఎంపిక జిల్లా మొత్తంపై ప్ర‌భావం చూపింద‌ని అంటారు. మ‌రి ఈ సారి బాబు జిల్లా లో ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుని టిక్కెట్లు కేటాయిస్తారో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: