ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు చాలా హాట్ హాట్‌గా ఉన్నాయి. అందుకు ప్రధాన కారణాలు రెండు. ఒకటి రాజకీయాలు కాగా... మరొకటి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్‌సీ గొడవ. ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్ల గడువున్నప్పటికీ... ఏపీలో మాత్రం 2024 ఎన్నికల కోసం ఇప్పటికే అన్ని పార్టీలు తమ కార్యాచరణ మొదలుపెట్టాయి. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ప్రతిపక్షాలు అన్నీ ఇప్పటి నుంచి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎదురుదాడి కూడా చేస్తున్నారు విపక్ష నేతలు. ఇక రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత కూడా నారా చంద్రబాబు నాయుడు కూడా వ్యాఖ్యానించారు. దీంతో అందరి దృష్టి ఎన్నికలపైనే ఉంది. దీంతో ఎన్నికల కోసం పొత్తుల పైన మూడు ప్రధాన పార్టీల మధ్య అనధికారిక చర్చలు మొదలైనట్లు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ మొదలైంది.

జగన్ ప్రభుత్వంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఆ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఇదే సమయంలో పీఆర్‌సీ వ్యవహారంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లు ఎక్కారు. ఇక ఉద్యోగుల్లో మొదలైన నిరసనలు సైతం వైసీపీకి రాజకీయంగా నష్టం చేస్తుందనే చర్చ మొదలైంది. ఈ పరిస్థితుల్లోనే ఏపీ ప్రజల్లో ఉన్న అభిప్రాయం తెలుసుకొనేందుకు ఇండియా టుడే సంస్థ ఓటర్ సర్వే నిర్వహించింది. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి మోదీ నేతృత్వంలోని ఎన్‌డీయే ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టనున్నట్లు తేలింది. ఇక అన్ని రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులపై పూర్తిస్థాయి ప్రజాదరణ కనిపించటం లేదు. అయితే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ ఆరో స్థానంలో ఉన్నారు. జాతీయ స్థాయిలో జగన్ పరిపాలనకు మద్దతు పెరుగుతున్నప్పటికీ... రాష్ట్రంలో మాత్రం ఆయనకు 40 శాతం కంటే తక్కువగానే మద్దతు లభించింది. ఇందుకు ప్రధానంగా వైసీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు, ప్రభుత్వంపై విమర్శలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: