
శ్రీకాకుళం జిల్లా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పాటయింది. మా జిల్లా పేరును ఎర్రన్నాయుడు శ్రీకాకుళం జిల్లాగా మార్చాలని ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉంది.అదీ కుదరకపోతే గౌతు లచ్చన్న (స్వాతంత్ర్య సమరయోధుడు) పేరు అయినా సూచించాలని కూడా డిమాండ్ ఉంది. టీడీపీ నాయకులుగా, కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖను చూసిన మంత్రిగా ఆయనకు ఉన్న పేరు దృష్ట్యా ఎర్రన్న పేరును జిల్లాకు ఉంచాలని డిమాండ్ చేయడం మంచిదే! కానీ వైసీపీ అందుకు అంగీకారం తెలిపేందుకు సిద్ధంగా లేదు. పోనీ లచ్చన్న పేరు కూడా బాగానే ఉంటుంది కానీ అది కూడా ఒప్పుకోవడం లేదు.
జిల్లా అన్నది ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పాటైంది.శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం, పలాస, ఇచ్ఛాపురం తో సహా విజయనగరం లోక్ సభ నియోజకవర్గంకు చెందిన ఎచ్చెర్లను కూడా ఇక్కడే ఉంచారు. వాస్తవానికి ఎచ్చెర్ల నియోజకవర్గం విషయమై కాస్త ఆందోళన రేగింది. ఎందుకంటే పాలనా సౌలభ్యం రీత్యా శ్రీకాకుళం జిల్లాలోనే తమ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఉంచాలని ఎచ్చెర్ల ప్రజలు గొంతెత్తారు.
దీనిని పరిగణనలోకి తీసుకుని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు సైతం మాట ఇచ్చి,సమస్యను సీఎం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించారు. ఎచ్చెర్లలోనే బీఆర్ ఏయూతో పాటు ట్రిపుల్ ఐటీలాంటి విద్యా సంస్థలు, పలు ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ హబ్ గా పేరుంది.అదేవిధంగా ఇండస్ట్రియల్ హబ్ గా పేరుంది. ఉద్దండులయిన రాజకీయ వేత్తలు కూడా ఇక్కడి నుంచే వచ్చారు. ఇక పాలకొండ నియోజకవర్గం మన్యం జిల్లాలో కలిసిపోయింది.దీంతో సుదీర్ఘ కాలంగా ఉన్న సీతంపేట ఐటీడీఏ జిల్లాకు కాకుండా పోయింది. ఇదొక్కటే నిరాశ. రాజాం నియోజకవర్గం కూడా పారిశ్రామిక వాడ..ఇది విజయనగరం లోక్ సభ పరిధిలో ఉంటుంది కనుక విజయనగరం జిల్లాలోనే కలిసిపోయింది. ఇది కూడా జిల్లా ప్రజలకు సుదీర్ఘమయిన కాలంగా అనుబంధం ఉన్న ప్రాంతం. కానీ ఈ ప్రాంతం ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఉండనుంది అని తెలిసి చాలామంది బాధపడుతున్నారు. శ్రీకాకుళం
జిల్లాను పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా పరిగణించి మూడు జిల్లాల పరిధిలోకి తెచ్చారు. ఒకటి శ్రీకాకుళం జిల్లా, మరొకటి
విజయనగరం జిల్లా, మూడోది మన్యం జిల్లా (అరకు లోక్ సభ నియోజకవర్గాన్ని రెండు ముక్కలుగా విభజించి ఈ నిర్ణయం తీసుకున్నారు.