ఏపీలో గత కొంతకాలంగా ఉన్న సమస్యలు ఒకరకం అయితే, ఇప్పుడు వస్తున్న సమస్యలు ఇంకోరకం. ఏకంగా ప్రభుత్వంలో ఉన్న అధికారులతోనే సమస్యలు వస్తున్నాయి. ఏపీలో ఉద్యోగులకు కొత్త జీతాల విషయం సందిగ్ధంలో పడింది. జనవరి జీతాలు అసలు వస్తాయా అన్న అనుమానం ఇంకా వీడలేదు. ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్నటువంటి  ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రభుత్వం నిర్ణయించినటువంటి కొత్త పీఆర్సీ సవరించిన వేతనాలపై ఇప్పటికే ఆర్డర్ జారీ చేసిన జీవో ప్రకారం జనవరి జీతాలను ఫిబ్రవరిలో వారి వారికి బదిలీ చేయాలని ప్రభుత్వం అధికారులకు వరుస పెట్టి సర్కులర్స్ పాస్ చేస్తూనే వస్తోంది.

ఇక ఇటువైపేమో  జీతాలు వద్దంటున్న ఉద్యోగులు.. ఫిబ్రవరి నెల వచ్చేస్తుంది జనవరి జీతాలు ఉద్యోగుల ఖాతాల్లో పడాల్సిన సమయం అయితే ఉద్యోగులకు, పెన్షనర్లకు కొత్త పీఆర్సీ జీవోల ప్రకారమే జనవరి వేతనాలు అన్న విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. వేతనాలను ప్రాసెస్ చేయాలంటూ ఇప్పటికే పలుమార్లు సూచించిన ఆర్ధిక శాఖ ఇప్పటికీ వారు ఏ విషయం తెల్చకపోవడంతో ఇపుడు అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఆర్ధిక శాఖ సిద్ధమవుతోంది. ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకునేలా చర్చలు జరుగుతున్నాయి.

ఓ వైపు ప్రభుత్వం జీతాలు ప్రాసెస్ చేయాలని చిలక్కి చెప్పినట్లు చెబుతున్నా ట్రెజరీ అధికారులు మాత్రం సర్కారు వారి మాటను పెడచెవిన పెడుతుండడంతో ఇక చెప్పేది లేదని చర్యలే గురి అని రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇక శరవేగంగా ఆర్ధిక శాఖ రంగంలోకి దిగి ఈ సమస్యను పరిష్కరించాలని చూస్తోంది. మరి ఇపుడైనా అధికారులు ప్రభుత్వం మాట వింటేరేమో చూడాలి. అయితే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అందుకు అధికారులు ఎలా స్పందిస్తారు అన్న వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఇలా రోజు రోజుకీ ఒక్కో విధంగా మారుతున్న జనవరి నెల జీతాల సంగతి ఎలా పూర్తి అవుతుందో తెలియడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: