
త్వరలోనే ఉద్యమం చేపడుతామని, చూస్తూ ఊరుకోం అని వెల్లడించారు సీఎం. ప్రాణాలకు తెగించి తెలంగాణ కోసం ఉద్యమం చేశాం. ప్రతి రంగానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ పేర్కొన్నారు. అదేవిధంగా దేశంలో రాజ్యాంగాన్ని ఇప్పటికే 80 సార్లు సవరించారని, దేశాన్ని బాగు చేయడం కోసం కొత్త రాజ్యాంగం అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే చాలా దేశాలు రాజ్యాంగాన్ని మార్చాయని, మన దేశంలో మార్చాలన్నారు. ముఖ్యంగా దేశంలో మార్పు తీసుకురావాలని ప్రజలను కోరుతున్నట్టు సీఎం వెల్లడించారు.
భారత రాజ్యాంగాన్ని కొత్తగా రాసుకోవాల్సిన అవసరం ఉందంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారమే రేపాయి. కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. రాజ్యాంగ బదద్ద పదవీలో ఉండి కేసీఆర్ అంబేద్కర్ ను అవమానించే విధంగా మాట్లాడటం దురదృష్టకరం అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మరొక వైపు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ.. భారత రాజ్యాంగాన్ని రాయడం మూలంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం అయిందని గుర్తు చేసారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవహేళన చేసేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం సరికాదు అన్నారు కోమటిరెడ్డి. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ రేపు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల్లో దీక్షలు చేపట్టాలని నిర్ణయించింది. తెలంగాణలో రాజకీయంలో రాజ్యాంగం రగడ మరీ ఏ మలుపు తీసుకెళ్లుతుందని ఆసక్తి రేపుతుంది.