నా మాటే శాసనం...అనేది బాహుబలి సినిమాలో శివగామి పాత్ర వేసిన రమ్యకృష్ణ చెప్పింది గాని..ఏపీ రాజకీయాల్లో ప్రతి వైసీపీ నాయకుడు ఇదే డైలాగ్‌ని ఆచరణలో పెడుతున్నట్లు కనిపిస్తున్నారు. గతంలో అధికారం అంటే ప్రజలకు సేవ చేయడానికి ఉండేది...కానీ ఇప్పుడు అధికారం అంటే ప్రజల మీద పెత్తనం చేయడానికి అన్నట్లు ఉంది..గత టీడీపీ ప్రభుత్వం నుంచి ఇదే వరుస కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇంకా అధికారంలో ఉంటే చాలు నాయకులు..తమకు ఎదురే లేదని అనుకుంటారు. తాము ఏదో రాజ్యాలని పాలిస్తున్నట్లు ఫీల్ అవుతారు. అంతా తమ మాటే వినాలని అనుకుంటారు...ఇక వినని వారి సంగతి ఏం అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ నేతలు అదే బాటలో వెళుతున్నారు....అయితే కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్...నా మాటే శాసనం అనే డైలాగుని పక్కాగా పాటిస్తున్నారట. కనిగిరిలో ఆయన చెప్పిందే వేదం...చేసేది చట్టం అన్నట్లు పరిస్తితి ఉందని కథనాలు వస్తున్నాయి. అసలు నియోజకవర్గంలో తనకు వ్యతిరేకగా ఎవరు మాట్లాడినా...పనిచేసినా కూడా ఎమ్మెల్యే గారు ఒప్పుకోరట. వెంటనే తన మాట వినేలా చేసుకోవడం..ఎమ్మెల్యే గారి నైజమట.

ప్రత్యర్ధి పార్టీ నేతలు లేరు...సొంత పార్టీ నేతలు లేరు..అంతా తన మాటే వినాలని ఎమ్మెల్యే అనుకుంటారట...అందుకోసం చాలా దూరమే వెళ్తారట. ఆ మధ్య హనుమంతునిపాడు వైస్ ఎంపీపీ విషయంలో జడ్పీటీసీ నారాయణ యాదవ్‌, ఎమ్మెల్యేని ప్రశ్నించారట..తమని సంప్రదించకుండా అభ్యర్ధిని ఎలా డిసైడ్ చేస్తారని అడిగారట. ఇంకా అంతే సొంత సామాజికవర్గం నేత అని చూడకుండా నారాయణ యాదవ్‌ని ఎమ్మెల్యే ముప్పుతిప్పలు పెడుతున్నారట. కేసులు కూడా పెట్టించారని తెలిసింది.

ఇలా తనకు ఎదురు వెళితే మాత్రం ఎమ్మెల్యే ఒప్పుకోవడం లేదట. అయితే ఎమ్మెల్యే వైఖరిపై సొంత పార్టీ నేతలు చాలా గుర్రుగా ఉన్నారు..నెక్స్ట్ ఎన్నికల్లో ఈయన్ని ఎలాగైనా ఓడించాలనే కసితో వైసీపీ నేతలు పనిచేస్తున్నారట. మొత్తానికి ఫ్యాన్ ఎమ్మెల్యేకు సొంత ఫ్యాన్స్ చెక్ పెట్టేలా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: