కేసీఆర్‌ VS బండి : సర్జికల్‌ స్ట్రైక్‌ పాలిటిక్స్‌ వర్కౌట్‌ అవుతాయా ?

సీఎం కేసీఆర్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.   నంబర్ వన్ అవినీతి పరుడు కేసీఆర్  అని.. నువ్వు సీఎం అయ్యాక ఒక రోజంతా నిన్ను సీబీఐ విచారణ చేసింది వాస్తవం కాదా అని నిలదీశారు బండి సంజయ్.  ని పర్సనల్ సెక్రటరీ గా ఉన్న దిలీప్ కుమార్ కేసీఆర్ పై అపరిచితుడు అనే పుస్తకం రాసాడని.. కేసీఆర్ కి కమిషన్ లు రావడం లేదు అందుకే అసహనమని నిప్పులు చెరిగారు బండి సంజయ్.   అన్ని లబ్ది దారులకు నేరుగా చేరుతుండడం తో నాకేంటి అనే బాధ ఆయనలో ఉందని.. విద్యుత్ సంస్కరణల పై కేసీఆర్ బట్టేబాజ్ మాటలు మాట్లాడారు.. అన్ని అబద్ధాలేనని నిప్పులు చెరిగారు బండి సంజయ్.   వ్యవసాయ మోటర్లకు మీటర్లు అవసరం లేదని జనవరి 3... 2022 న అన్ని రాష్ట్రాలకు కేంద్రం గైడ్ లైన్స్ పంపించిందని..ఎంపీ లు పార్లమెంట్ లో ఏమి పీకుతున్నారన్నారు బండి సంజయ్.


మీటర్లు పెట్టె కుట్ర కేసీఆర్ ది... కేంద్రం ని చూపి కరెంట్ బిల్లులు పెంచుతాడడని.. డిస్కమ్ లు ఫ్రీ కరెంట్ ఇస్తున్నవి... 48 వేల కోట్లు బకాయిలు ఉందని చెప్పారు బండి సంజయ్. కేసీఆర్ కి పాకిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.  కేసీఆర్ కి దుబాయ్ లో ఇల్లు ఉంది, సింగపూర్ లో ఇల్లు ఉందని ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.   కేసీఆర్ జైల్ మెట్స్ ని కలుస్తున్నాడన్నారు బండి సంజయ్.  పీకే సర్వే లోనే బీజేపీ 64 సీట్లు గెలిస్తుందని 3 నెలల క్రితమే వచ్చిందన్నారు బండి సంజయ్.   హైద్రాబాద్ లో అభివృద్ధి ఎవరి నిధులతో జరుగుతుంది... పాత బస్తీలో 80 శాతం బిల్స్ లు పెండింగ్ లో ఉన్నాయన్నారు బండి సంజయ్.   సర్జికల్‌ స్ట్రైక్‌ పై కేసీఆర్‌ ఇండియాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.   సర్జికల్‌ స్ట్రైక్‌ కేసీఆర్‌ మాటలు దారుణమని.. ఆయనకు డీఎన్‌ఏ పరీక్షలు చేయించాలన్నారు బండి సంజయ్.  

మరింత సమాచారం తెలుసుకోండి: