ఈ సారి ఎన్నికల్లో చాలామంది టీడీపీ నేతలకు లక్కీ ఛాన్స్ దక్కేలా ఉంది..గత ఎన్నికల్లో అంటే బ్యాడ్ లక్‌తో ఓడిపోయారు...జగన్ వేవ్‌లో అంతా కొట్టుకుపోయారు..కానీ ఈ సారి పరిస్తితి మారుతుంది..జగన్ గాలి తగ్గుతుంది...పైగా అధికారంలో ఉండి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఏమి చేసే పరిస్తితి కనిపించడం లేదు..దీంతో చాలామంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేక పెరిగే అవకాశం ఎక్కువ ఉంది..ఇదే టీడీపీ నేతలకు బాగా బెనిఫిట్ అయ్యేలా ఉంది. ఇక బెనిఫిట్ ఎక్కువ నేతలకు నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

అలా గెలిచే ఛాన్స్ సీనియర్ నేత ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి కూడా ఉందని చెప్పొచ్చు...ఈయన ప్రస్తుతం కనిగిరి స్థానం ఇంచార్జ్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఆ స్థానంలో టీడీపీ చాలా వరకు పికప్ అయింది...అలా టీడీపీ పికప్ అవ్వడానికి ప్రధాన కారణం ఉగ్రనరసింహ అనే చెప్పాలి. ఆయన ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, టీడీపీ శ్రేణులకు అండగా నిలబడటం..అలాగే తన ఫాలోయింగ్‌ని మరింత పెంచుకోవడంతోనే కనిగిరిలో టీడీపీ బలం పెరిగింది.

అయితే 2009లో ముక్కు...కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కనిగిరిలో విజయం సాధించిన విషయం తెలిసిందే...అలాగే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు...కానీ రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్తితి ఘోరంగా తయారైంది..ఈ క్రమంలోనే 2019 ఎన్నికల ముందు ముక్కు టీడీపీలోకి వచ్చి...కనిగిరి స్థానం నుంచి పోటీ చేసి దాదాపు 40 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. అంత భారీ మెజారిటీతో ఓడిపోయిన ముక్కు...నిదానంగా వైసీపీ మెజారిటీ తగ్గిస్తూ వచ్చారు.

పైగా వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ పనితీరు పట్ల కనిగిరి ప్రజలు పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు...ప్రజలే కాదు ఈయన పట్ల సొంత పార్టీ వాళ్లే వ్యతిరేకంగా ఉన్నారు...గత ఎన్నికల్లో అంటే జగన్ గాలిలో గెలిచారు గాని...ఈ సారి మాత్రం జగన్ సైతం...బుర్రాని కాపాడే పరిస్తితి కనిపించడం లేదు...మొత్తానికి కనిగిరిలో ముక్కుకు లక్ చిక్కేలా ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: