ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. తెలంగాణాలో బీజేపీ స్పీడు మరింతగా పెరిగిపోతోంది. ఇందులో భాగంగానే ఏపీలో కూడా రాజకీయాలు స్పీడందుకోబోతున్నాయి. ప్రస్తుతం జనసేన+బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే పేరుకే మిత్రపక్షాలు కానీ వాస్తవంగా రెండుపార్టీలు కలిసి పనిచేస్తున్నదే లేదు. ఎప్పుడెప్పుడు బీజేపీని వదిలేసి తెలుగుదేశంపార్టీతో కలుద్దామా అని పవన్ ఎదురు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.





ఈనెల 14వ తేదీన మంగళగిరిలో జరగబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో జనసేన అధినేత పవన్ కల్యాన్ కీలకమైన ప్రకటన చేయబోతున్నారు. భవిష్యత్తు రాజకీయాలకు సంబంధించి పవన్ ప్రకటిస్తారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పిన విషయం తెలిసిందే. అప్పటినుండి రాజకీయపార్టీలు 14వ తేదీ సభకోసం వెయిట్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. దీనివల్ల రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారబోతున్నట్లు సమాచారం.





దేశంలో బీజేపీ పరిస్ధితి ఎలాగున్నా ఏపీలో మాత్రం పాతాళంలోనే ఉండిపోయింది. అందుకనే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తొందరలోనే బీజేపీ అగ్రనేతలు ప్రకటించబోతున్నట్లు సమాచారం. సీఎం అభ్యర్ధిగా ప్రకటించేసి పవన్ను ఎటూ పోనీయకుండా ఫిక్స్ చేయాలని బీజేపీ పెద్దల ఆలోచనగా ఉందట. పవన్ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించటం వల్ల మూడు ఉపయోగాలు ఉంటాయని కమలంపార్టీ పెద్దలు భావిస్తున్నారు.




అవేమిటంటే మొదటిది పవన్ సామాజికవర్గమైన కాపుల ఓట్లను వేయించుకోవటం. ఇక రెండోదేమంటే పవన్ అభిమానుల ఓట్లన్నింటినీ గంపగుత్తగా వేయించుకోవటం. ఇదే సమయంలో ఇటు జగన్మోహన్ రెడ్డి, అటు చంద్రబాబునాయుడు అంటే పడని వారి ఓట్లను కూడా ఆకర్షించటం. మరి కమలనాదుల ఆలోచనలు బాగానే ఉన్నాయి. కానీ ఆచరణలో ఎంతవరకు సాధ్యమన్నదే ఇపుడే చెప్పటం కష్టం. బీజేపీని పవనే ఒంటరిగా మోయాలి కాబట్టి సీఎం అభ్యర్ధిగా ప్రకటిద్దామనే ఆలోచనలో కమలనాదులు ఉన్నట్లు సమాచారం. షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళుంది కాబట్టే. చూద్దాం ముందు ముందు ఏమి జరగబోతోందో.  

మరింత సమాచారం తెలుసుకోండి: