ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సమయం నుండి ఏదో ఒక సంచలనం చేస్తూనే వచ్చాడు. ముఖ్యంగా ఇతనిపై కేసులు ఏమీ కొత్త కాదు. అడుగడుగునా ఎన్నో కేసులు బనాయించి జైళ్లకు పంపిన ఘటనలు ఉన్నాయి. అలాంటి ఎన్నో కేసులు ఇప్పటికే పెండింగ్ లో ఉన్నాయి. అందుకే సీఎం జగన్ ఇప్పటికీ కూడా ఏదైనా ఒక విషయంపై తన వాణిని బలంగా వినిపిస్తారు. తాను కరెక్ట్ అని నమ్మిన దాని కోసం ఎంతకైనా పోరాడుతాడు. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం తెలంగాణలోని నాంపల్లి కోర్టు జగన్ కు సమన్ లు జారీ చేసి అందరినీ షాక్ కు గురి చేసింది. అయితే ఇంతకీ ఏమి జరిగింది అని అందరూ ఆశ్చర్యంలో ఉన్నారు.

అయితే ఈ కేసు ఇప్పటిది కాదట... గతంలో 2014 వ సంవత్సరంలో తెలంగాణలో హుజూర్ నియోజకవర్గం ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ చెప్పిన నియమాలను ఉల్లంఘించిన కారణంగా అప్పట్లో ఆరోపణలు ఉండడం తెలిసిందే. అయితే అప్పుడు జగన్ తో పాటుగా మరో ఇద్దరు వైసీపీ నాయకులు అయిన శ్రీకాంత్ రెడ్డి మరియు నాగి రెడ్డి లపై కూడా ఆరోపణలు ఉన్నాయి.  దాదాపుగా 8 సంవత్సరాల తర్వాత ఈ కేసులో జగన్ కు సమన్లు జారీ చేయడం, అందులోనే జగన్ ఇప్పుడు ఒక రాష్ట్రాలను సీఎం కావడం తో ప్రజలు అంతా కంగు తింటున్నారు. ఇందులో భాగంగా సీఎం జగన్ మరియు మిగిలిన ఇద్దరు కూడా ఈ నెల 28 వ తేదీన నాంపల్లి కోర్టుకు విచారణ నిమిత్తం హాజరు కావలసి ఉన్నదని కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

దీనితో ఇప్పటికే ఉన్న కేసులతో పాటుగా ఇది కూడా పక్కన చేరింది. అయితే కేసులు అయితే ఉన్నాయి. క్నీ వీటికి ఎప్పుడు పరిష్కారం దొరుకుతుందో అని జగన్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఇందులో ఏమైనా మతలబు ఉందా? ఇది ఒక రాజకీయ వ్యూహమా ? అన్న కోణంలోనూ రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: