తెలంగాణ సీఎం కేసీఆర్ ఒంటి కాలు మీద జాతీయ స్థాయి రాజకీయాల్లో ప్రవేశించాలని ఎప్పటి నుండో ఒక లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా స్టెప్ బై స్టెప్ వెళుతున్నారు. అయితే దేశ రాజకీయాలలో ప్రస్తుతం బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలకు మించి ఏదీ బలమైన పార్టీ లేకపోవడం కేసీఆర్ కోరికను అణచివేసేలా ఉంది. కాగా చాలా వరకు ప్రాంతీయ పార్టీలు మాత్రమే తమ రాష్ట్రాలలో బలంగా ఉన్నాయి, ఇతర రాష్ట్రాలలో చూసుకుంటే బలహీనంగా ఉన్నాయి. కాగా బలమైన కాంగ్రెస్ తో కలవడానికి బీజేపీ వ్యతిరేక పార్టీలు కొన్ని సుముఖంగా లేవు. ఇలా కేసీఆర్ లక్ష్యం సఫలం కాకుండా ఉండడానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ఒక సంఘటన మాత్రం రాజకీయ మేధావులను ఆలోచనలో పడేసింది.

నిన్న కర్ణాటక మాజీ సీఎం మరియు జేడిఎస్ నేత కుమారస్వామి తెలంగాణ లోని ప్రగతిభవన్ లో కేసీఆర్ ను కలిశారు. ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం మంచి నిర్ణయం అని, ఇలాంటి నాయకులు జాతీయ రాజకీయాల్లో ఉండడం చాలా అవసరం అని కొనియాడారు. ఈ భేటీ పట్ల జేడీఎస్ కేసీఆర్ కు మద్దతు ఇస్తున్నట్లు అనుకోవాలి. అయితే ఆ మద్దతు ఏ విధంగా అనంది ఇంకా తెలియాల్సి ఉంది. పైగా జేడీఎస్ సొంత రాష్ట్రం కర్ణాటక లోనే చాలా బలహీనం అయింది... ఇక జాతీయ స్థాయిలో దాని ప్రభావం ఏమీ లేదు. కర్ణాటకలో జేడీఎస్ కాంగ్రెస్ మిత్ర పక్షాలుగా ఉన్నాయి.

అదే విధంగా జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ కు జేడీఎస్ మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ మద్దతు ఏ విధంగా ముందుకు సాగుతుంది. ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్స్ లో కర్ణాటకలో  జేడీఎస్ తెరాస కు సీట్లు ఏమైనా ఇస్తుందా అన్నది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. దీనిని బట్టి కేసీఆర్ కర్ణాటకలో రాజకీయంగా అడిగి వేయబోతున్నారు. మరి ఇది ఇంకెన్ని మలుపులు తీసుకుంటుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: